హైదరాబాద్

అందరికీ అందుబాటులో అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేగంపేట: తన గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటానని సనత్‌నగర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం మారెడ్‌పల్లిలోని తలసాని నివాసంలో కార్యకర్తలు, అభిమానులు, స్థానిక కార్పొరేటర్‌లు ఆయనను సత్కరించి అభినందించారు. తలసాని మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి కృషి ఫలితమే తన గెలుపునకు దోహదపడిందన్నారు.
తనపట్ల నమ్మకం ఉంచి గెలిపించినందుకు వారి మేలు మరువనని, వారి నమ్మకాన్ని వమ్ముచేయనని హామీ ఇచ్చారు.
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం అర్చకులు తలసాని నివాసానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వదించారు. నియోజకవర్గంలోని కార్పొరేటర్‌లు అత్తెల్లి అరుణగౌడ్, తరిణి, శేషుకుమారి, లక్ష్మిబాల్‌రెడ్డి, హేమలత- శ్రీనివాస్ యాదవ్‌ను సత్కరించి అభినందించారు.
సనత్‌నగర్ నియోజకవర్గంతో పాటు జంటనగరాల్లోని వివిధ ప్రాంతాల నుండి కార్యకర్తలు, నేతలు విచ్చేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు గుర్రం పవన్‌కుమార్ గౌడ్, అక్బర్, నాగేందర్, ఖలీల్, సత్యనారాయణ, బాల్‌రెడ్డి, సురేష్ గౌడ్, కరుణాకర్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, లలితాచౌహాన్, గోపీ చౌహన్, సంతోష్, అబ్బాస్, ప్రవీణ్, కుమార్, శ్రీహరి, శేఖర్ పాల్గొన్నారు.
దివ్యాంగులకు పురస్కారాలు ప్రదానం
కాచిగూడ, డిసెంబర్ 12: ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో దివ్యాంగులకు పురస్కారాలు ప్రదానోత్సవ కార్యక్రమం బుధవారం గానసభలోని కళా లలిత కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి కళాభిమాని శివరామకృష్ణ, ప్రముఖ రచయిత్రి రాఘవరావు, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, ప్రముఖ కవి రఘుశ్రీ, మిమిక్రీ ఆర్టిస్ట్ మోహన కృష్ణ, సంస్థ అధ్యక్షురాలు పాలపర్తి సంధ్యారాణి పాల్గొని దివ్యాంగులకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేశారు. దివ్యాంగులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని కళారంగంలో ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. తరంగిణి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు నాగశ్రీ, పలు నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.