హైదరాబాద్

ఆశల పల్లకి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఐదుగురు మంత్రులతో నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. తన మంత్రివర్గంలో ఎవరెవరికి స్థానం కల్పిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
నగరంలో గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో జి. సాయన్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందగా, మిగిలిన వారిలో పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్, దానం నాగేందర్, ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్ బీసీ సామాజికవర్గానికి చెందినవారు. బీసీ సామాజికవర్గానికి చెందిన ఐదుగురిలో పద్మారావు, తలసానిలకు మంత్రులగా అనుభవం ఉంది. మొదటిసారి టీఆర్‌ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్ వైఎస్‌ఆర్ హయాంలో మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈసారి మంత్రివర్గంలో కొత్తవారికి స్థానం కల్పించాలని సీఎం భావిస్తున్నందున, బీసీ వర్గానికి చెంది, మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముఠాగోపాల్, కాలేరు వెంకటేశ్‌లకు సైతం మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలు లేకపోలేదు. మొత్తానికి మూడు సామాజికవర్గాలకు చెందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో రెండు సామాజికవర్గాలకు చెందిన ఇద్దరికి కేసీఆర్ మంత్రివర్గంలో చోటు లభించే అవకాశాలున్నట్లు, ఆ ఇద్దరు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్, సికిందరాబాద్ నుంచి గెలుపొందిన పద్మారావు ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ మంత్రివర్గంలో అపద్ధర్మ మంత్రులుగా కొనసాగిన సంగతి తెలిసిందే.
ముగ్గురు పాత..నలుగురు కొత్త
టీఆర్‌ఎస్ నుంచి హైదరాబాద్ నగరంలో గెలుపొందిన ఏడుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు పాతవారు కాగా, నలుగురు కొత్తవారున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్, కంటోనె్మంట్ నుంచి గెలిచిన జి. సాయన్నలతో పాటు మొట్టమొదటి సారిగా అంబర్‌పేట నుంచి అసెంబ్లీకి ఎన్నికైన కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ నుంచి విజయం సాధించిన ముఠా గోపాల్‌లలో ఎవరికో ఒక్కరికి అవకాశం దక్కినా ఆశ్చర్యం లేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నుంచే కేసీఆర్‌తో వున్న టీ.పద్మారావుకు గురువారం ప్రమాణం చేయనున్న ఐదుగురు మంత్రుల్లో స్థానం లభించకపోయినా, ఆ తర్వాత 13 మందితో జరిగే మంత్రివర్గ కూర్పులో కీలక శాఖ అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచి, ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ ఇప్పటికే ఓ దఫా సినిమాటోగ్రఫీ, వాణిజ్యపన్నుల శాఖ మంత్రిగా వ్యవహరించగా, ఆ తర్వాత కొంతకాలానికే ఆయన్ను వాణిజ్య పన్నుల శాఖ నుంచి తప్పించిన సంగతి తెలిసిందే! అసెంబ్లీ రద్దయ్యే వరకు కూడా ఆయన పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ మంత్రిగా వ్యవహరించిన అనుభవం ఉంది. 2014 ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన జి.సాయన్నకు ఇప్పటి వరకు కేసీఆర్ ఎలాంటి కీలక బాధ్యతలు గానీ, అవకాశాలు కానీ ఇవ్వలేదు.