హైదరాబాద్

ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : ఇంధన పొదుపుప్రతి ఒక్కరి బాధ్యత అని హెచ్‌ఎండీఏ కమిషనర్ జనార్ధన్ రెడ్డి అన్నారు. ఇంధన పొదుపు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా (ఐఇఐ) విశే్వశ్వరయ్య భవన్‌లో ఏర్పాటుచేసిన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భావితరాలకు అద్భుతమైన సహజ వనరులను అందించేందుకు ఇంధన పొదుపు తప్పని సరి అని అన్నారు. భూగర్భం నుంచి వెలికి తీస్తున్న ఖనిజాలతో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ వినియోగం వృథా కాకుండా చూడాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న సమయంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఎల్‌ఇడీ లైట్లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇందుకు ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందించడంతో లక్ష్యాన్ని చేరుకోగలిగామని చెప్పారు. అదేవిధంగా నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కార్యాలయాల్లో ఏసీల వాడకాన్ని నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. దీని ద్వారా జీహెచ్‌ఎంసీపై విద్యుత్ భారం చాలా వరకు తగ్గిందన్నారు. ఇంధనమంటే కేవలం విద్యుత్ ఒక్కటే కాదని, పెట్రోల్, డిజీల్, గ్యాస్ వంటివి కూడా ఇందులో ఉంటాయని తెలిపారు. అవసరం మేరకే వాహనాలను వాడటం ద్వారా ఇంధనాన్ని ఆదా చేయడంతో పాటు వాతావరణ కాలుష్యాన్ని నివారించవచ్చునని అన్నారు. పర్యావరణానికి చేటుచేయని ఎలక్ట్రిక్ వాహనాలను వాడుకోవాలని, సోలార్ ఎనర్జీని వాడుకోవాలని సూచించారు. చిన్నచిన్న పనుల కోసం బయటకు వెళ్లేవారు కాలినడక వెళ్లడం ద్వారా ఆరోగ్యంతో పాటు ఇంధనం పొదుపు చేసినవారు అవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ఇంధనాన్ని పొదుపుగా వాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఐఇఐ చైర్మన్ రామేశ్వరరావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జనాభా ఆధారంగా రిజర్వేషన్లు అమలు జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం డిమాండ్
ఖైరతాబాద్, డిసెంబర్ 14: జనాభా ఆధారంగా ప్రతి కులానికి రిజర్వేషన్లు అందించినప్పుడే ఆయా వర్గాలు అభివృద్ధి సాధ్యమవుతుందని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం పేర్కొంది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు కేసీ కాలప్ప మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చెప్పడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. బీసీలను, ఎంబీసీలకు అన్యాయం చేస్తున్నారని చెప్పారు. ఈ ధోరణిని మార్చేందుకు కృషి చేస్తానన్న సీఎం కేసీఆర్ వెంట తామంతా కలిసి నడుస్తామని తెలిపారు.

బోగస్ సంస్థల ఏర్పాటు.. రూ.150 కోట్ల గోల్‌మాల్

రూ.14కోట్లు సీజ్ 14వేల మంది బాధితులు

గచ్చిబౌలి, డిసెంబర్ 14: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు అక్రమంగా డబ్బు సంపాదించేందుకు చెడు బాట పట్టాడు. ఉద్యోగానికి సెలవు పెట్టి బోగస్ కంపెనీలు ఏర్పాటు చేసి అధిక వడ్డీ ఆశ చూపించి ప్రజలను మోసం చేయడం ప్రారంభించాడు. సంస్థలో సభ్యులుగా చేర్పించిన ఏజెంట్లకు మూడుశాతం కమీషన్ ఇచ్చి, బ్యాంకాక్, సింగపూర్ విదేశీ ట్రిప్పులు పంపించేవాడు. రెండు తెలుగు రాష్ట్రాలలో 14 వేల మంది రైతులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజల నుంచి రూ.158 కోట్లు వసూలు చేసి మోసం చేశాడు. వడ్డీ చెల్లించకపోవడంతో పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో అసలు రూపం బయట పడింది. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నిందితుడి వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా రేవల్లి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న మెతుకు రవీందర్.. డబ్బు సంపాదించడం కోసం భారీ స్కామ్‌కు తెరలేపాడు. ప్లాన్ ప్రకారం ఉద్యోగానికి దీర్ఘకాలం సెలవు పెట్టి సన్ పరివార్ ఉపాధి మేనేజ్‌మెంట్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. లక్ష రూపాయలు తమ సంస్థలో పెట్టుబడి పెడితే నెలకు రూ.6వేల రూపాయలు వడ్డీని 25 మాసాలు చెల్లిస్తామని నమ్మించాడు. 25 నెలల తరువాత లక్ష తిరిగి ఇస్తామని చెప్పడంతో అనేక మంది లక్షల రూపాయలు సంస్థలో పెట్టుబడి పెట్టారు. సంస్థలో పెట్టుబడి పెట్టించిన ఏజెంట్లకు కమిషన్‌తో పాటు విదేశాలకు పంపించేవాడు. శామీర్‌పేటలో సంస్థ మాయమాటలకు మోసపోయిన బాధితుడు ఫిర్యాదు చేశారు. కేసు పరిశీలించిన సీపీ దర్యాప్తు నిమిత్తం ఎకనామిక్ ఆఫెన్సస్ వింగ్‌కు బదిలీ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ తెలిపారు. సన్ మ్యూచువల్ ఎడెడ్ తిఫ్‌ట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ, సన్ పరివార్ ఉపాధి మేనేజ్‌మెంట్, మెతుకు చిట్‌ఫండ్, మెతుకు వెంచర్స్, మెతుకు హెర్బల్, మెతుకు మెడికల్ హెర్బల్ ఫౌండేషన్, మెట్స్ నిధి పేరుతో ఏడు బోగస్ సంస్థలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితుడు ప్రభుత్వ ఉద్యోగి కావడంతో బంధువుల పేరున సంస్థలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 158 కోట్ల రూపాయలు వసూలు చేసిన నిందితుడు.. శ్రీచక్ర వెంచర్స్‌ను ఏర్పాటు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు సీపీ వివరించారు. పలు ప్రాంతాలో భూములను కూడా కొనుగోలు చేశాడని పేర్కొన్నారు. పలు బ్యాంక్ అకౌంట్లలో ఉన్న రూ.14 కోట్ల రూపాయలను సీజ్ చేసినట్లు సీపీ చెప్పారు. సన్ పరివార్ నిర్వాహకుడు రవీందర్‌ని అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారిని కూడా అరెస్టు చేయనున్నట్లు సీపీ వెల్లడించారు. నిందితుడి నుంచి చాలా వరకు సమచారం సేకరించాల్సి ఉందని పోలీసు కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సీపీ చెప్పారు. ఎకనామిక్ ఆఫెన్సస్ వింగ్ డీసీపీ విజయ్ కుమార్, ఏడీసీపీ ప్రవీణ్ కుమార్, సీఐలు గోపినాథ్, విజయ్, హనుమంతుతో పాటు సిబ్బంది కేసులో నిందితులను అరెస్టు చేశారని చెప్పారు. అధికారులకు నగదు రివార్డు అందించి సీపీ అభినందించారు.