హైదరాబాద్

కలెక్షన్ ఫీవర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: నగరంలోని కోటి మంది జనాభాకు అవసరమైన పౌర సేవల నిర్వహణ, అభివృద్ధి పనులకు జీహెచ్‌ఎంసీకి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్నును వసూలు చేసుకునేందుకు బల్దియా సిద్ధమైంది. నిన్నమొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికల్లో బిజీగా ఉన్న బల్దియాకు ఇపుడు కలెక్షన్ ఫీవర్ పట్టుకుంది. ఇప్పటికే నగరంలో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుల పనులు ఊపందుకోవటంతో ఆస్తిపన్ను వసూళ్లను వేగవంతం చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కమిషనర్ దాన కిషోర్ సర్కిల్ స్థాయి డిప్యూటీ కమిషనర్లు, జోనల్ స్థాయి జోనల్ కమిషనర్లకు వసూళ్ల టార్గెట్లను విధించారు. ఎప్పటికపుడు అధికారులు తమ పరిధిలోని ట్యాక్సు సిబ్బందితో సమీక్షలు నిర్వహించి, కలెక్షన్‌ను మెరుగుపర్చాలని ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గత ఆర్థిక సంవత్సరం బల్దియా రూ. 1200 కోట్ల పైచిలుకు ఆస్తిపన్నును వసూలు చేసుకున్న సంగతి తెలిసిందే! ఈ ఆర్థిక సంవత్సరం (2018-19)కు గాను రూ. 1500 కోట్ల ఆస్తిపన్ను వసూలు చేయాలని గత ఏప్రిల్ మాసంలోనే నిర్ణయించారు. అంతేగాక, ప్రతి సంవత్సరం కేవలం డిసెంబర్ నుంచి మార్చి వరకు దృష్టి సారించే ఆస్తిపన్ను వసూళ్లను ఏడాది మొత్తం విస్తృతంగా చేయాలని నిర్ణయించారు. కానీ అంతలోనే అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు రావటంతో మొత్తం బల్దియా అధికారులు, సిబ్బంది ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఇటీవలే ఎన్నికల విధులు ముగియటం, మున్ముందు జీహెచ్‌ఎంసీలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశముండటంతో కాస్త ముందుగా కళ్లు తెరిచిన జీహెచ్‌ఎంసీ అధికారులు రానున్న మూడున్నర నెలలపాటు ఆస్తిపన్ను వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యంగా పెట్టకున్న రూ. 1500 కోట్లలో ఇప్పటి వరకు రూ. 745 కోట్లను వసూలు చేసుకున్న జీహెచ్‌ఎంసీకి ముందు మరో 50 శాతం వసూళ్ల లక్ష్యం ఉంది. దీన్ని అధిగమించి రూ. 1500 కోట్లకు మించి వసూలు చేయాలని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 31వ తేదీ వరకు మరో రూ. వంద కోట్లు వసూలు చేయాలని కమిషనర్ లక్ష్యాన్ని విధించారు. కేవలం ట్యాక్సు సంబంధిత అధికారులు, సిబ్బందే గాక, మున్ముందు అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు కూడా క్షేత్ర స్థాయిలో పన్ను వసూలుకు పంపించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నట్లు సమాచారం. దీర్ఘకాలంగా పెడింగ్‌లో ఉన్న మొండి బకాయిల వసూళ్ల విషయంలో ఈ ఉన్నతాధికారులు చొరవ తీసుకునేలా వారికి కమిషనర్ ఆదేశాలివ్వనున్నారు. లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1500 కోట్లను జీహెచ్‌ఎంసీ వసూలు చేసుకున్నా, అప్పటి వరకు పలు ఎస్‌ఆర్‌డీపీ పనులు పూర్తయ్యే అవకాశముండటం, వాటికి వందల కోట్లలో బిల్లులు చెల్లించాల్సి ఉన్నందున, ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి తర్వాతి ఆరు నెలల తర్వాత బల్దియాలో ఆర్థిక సంక్షోభం మరింత తలెత్తే అవకాశముంది? ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది చర్చనీయాంశంగా మారింది.