హైదరాబాద్

ట్యాంక్‌బండ్‌పై అర్థరాత్రి వేడుకలను నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసిన ప్రభుత్వం అక్కడ భద్రత ఏర్పాట్లు చేయడంలో పూర్తిగా విఫలమైంది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి అనేకమంది సాయంత్రం, రాత్రి వేళల్లో పరిసర ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరుతుంటారు. ఇటు బషీర్‌బాగ్, సెక్రటేరియట్ నుండి సికింద్రాబాద్ వైపు, అటు సింకింద్రాబాద్, రాణిగంజ్ వైపు నుండి బషీర్‌బాగ్ వైపు వచ్చే, వెళ్లే వాహనాలతో ఎల్లపుడూ ట్యాంక్‌బండ్ రోడ్డు రద్దీగా ఉంటుంది. ట్యాంక్‌బండ్‌పై ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ కొన్ని సందర్భాల్లో సరిగ్గా పనిచేయడం లేదు. ఇది ఇలాఉండగా పర్యాటకులతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు ఎపుడు కళకళలాడతాయి. ఇక్కడికి విచ్చేసేందుకు అధిక శాతం సాయంత్రం, రాత్రి వేళల్లోనే వస్తుంటారు. గతంలో ట్యాంక్‌బండ్‌లో దూకి అనేకమంది ఆత్మహత్యలకు సైతం పాల్పడిన సంఘటనలు చోటు చేసుకోవడంతో సెంట్రల్ జోన్‌కు సంబంధించిన పోలీసులు ఇక్కడ పహారా కాస్తుంటారు. ఇది ఇలాఉండగా అర్థరాత్రి దాటిందంటే చాలు బోట్స్ క్లబ్ నుండి ఇటు రాణిగంజ్ వచ్చే ట్యాంక్‌బండ్ రోడ్డుకు ఇరువైపుల రోడ్డుపైనే వాహనాలు ఆపి బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుతుండటంతో రోడ్డు రద్దీగా మారుతోంది. నగర ట్రాఫిక్ పోలీసు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోకుండా ట్యాంక్‌బండ్ రోడ్డుకు ఇరువైపుల కార్లు, ద్విచక్ర వాహనాలు ఇష్టం వచ్చినట్లు నిలిపివేయడంతో అనేక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. అర్థరాత్రి పనె్నండు దాటిందంటే చాలు యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో ట్యాంక్‌బండ్‌పై చేరుకుని బర్త్‌డే సెలబ్రేషన్స్ అంటూ రోడ్డును జామ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అనేకమార్లు ట్యాంక్‌బండ్‌పై రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రాకపోకలకు రాత్రి వేళల్లో తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. బర్త్‌డే వేడుకల్లో పాల్గొంటున్న యువత మద్యం సేవించి హంగామా చేస్తున్నారు. ఇకనైనా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని, ట్యాంక్‌బండ్‌ను సందర్శించే పర్యాటకుల భద్రత విషయంలో అదేవిధంగా ట్యాంక్‌బండ్‌పై రాత్రి వేళల్లో ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డ్రంకన్ అండ్ డ్రైవ్ వంటి కార్యక్రమాలపై దృష్టి సారించిన పోలీసులు నగరంలోని వివిధ పర్యాటక ప్రాంతాల వద్ద పోలీసు నిఘాను ముమ్మరం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ట్యాంక్‌బండ్‌పై అర్థరాత్రి బర్త్‌డేలను నిషేధించి, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగ్గా పనిచేసేలా నగర సీపీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.