హైదరాబాద్

పెరిగిన చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ఆంధ్రా ప్రాంతంలో ఏర్పడిన పెథాయ్ తుపాను ప్రభావం తెలంగాణలోని వివిధ జిల్లాల్లో ప్రభావం చూపుతోంది. రెండు రోజులుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి ఉదయం బయటకు రావడానికి జంకుతున్నారు. ఉదయం వేళల్లో రోడ్లన్నీ మంచు కప్పుకుంటుడంతో చలి తీవ్రత మరింత పెరిగింది.
ఇరువైపుల మంచుతో రోడ్లు కనిపించక పోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల నుంచి బయటకు వెళ్లేవారు చలి నుంచి రక్షించుకునేందుకు ఉన్ని దుస్తులు ధరించడమే కాకుండా, పలు సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు చలి తీవ్రతను తట్టుకోలేక ఉన్ని వస్త్రాలు ధరిస్తున్నారు. నగరవాసులు సాయంత్రం చీకటి పడగానే ఇళ్లకు చేరుకుంటున్నారు. పెథాయ్ తుపాన్‌తో తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని, చలి బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో గరంగరం ఛాయ్, వేడి వేడి తినుబండారాలకు గిరాకీ పెరిగింది.