హైదరాబాద్

ఫుట్‌‘పాట్లు’ కనుమరుగవుతున్నాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరాన్ని విశ్వనగరంగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల సిటీగా తీర్చిదిద్దేందుకు పాలకులు చేస్తున్న ప్రకటనలు క్షేత్ర స్థాయిలో ఫలించటం లేదు. కనీసం రోడ్డుపై నడిచే పాదచారులు సురక్షితంగా ఇంటికెళ్తారన్న గ్యారంటీ లేదు. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై జిహెచ్‌ఎంసి మొక్కలను నాటగా, విద్యుత్ శాఖ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేస్తోంది. అంతేగాక, మేమేం తక్కువా అన్నట్టు ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు గొడుగులు ఏర్పాటు చేయగా, మరికొందరు నేతలు ఫుట్‌పాత్‌లను కబ్జా చేసుకుని దందాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులకు అక్రమ పార్కింగ్ కూడా తోడవ్వటంతో కాలక్రమేనా ఫుట్‌పాత్ కనుమరుగవుతోంది. పైగా ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ నిబంధనల ప్రకారం 9 వేల కిలోమీటర్ల రోడ్లకు గాను సగానికి పైగా అంటే కనీసం 5వేల కిలోమీటర్ల వరకు ఫుట్‌పాత్‌లను నిర్మించాలన్న నిబంధన ఉన్నా, ఏ మాత్రం అమలు చేయటం లేదని కేటీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే! పరిస్థితి ఇప్పటికైనా మారాలి అని మంత్రి పాఠాలు చెప్పినా నేటికీ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కుదర లేదు. రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు ఎన్ని సంస్కరణలను ప్రవేశపెట్టినా, ఆధునిక రవాణా వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చినా, పాదచారులకు కష్టాలు తప్పటం లేదు. నగరంలో ఏ ప్రధాన రహదారిని గమనించినా, కిలోమీటరు దూరంలో యూ టర్న్, ఎక్కడ కూడా రోడ్డు దాటేందుకు అనుకూలమైన పరిస్థితుల్లేవు. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ కోసం పదేళ్ల క్రితం ప్రవేశపెట్టిన హాకర్స్ పాలసీ ప్రకారం అధికారులు ఫుట్‌పాత్‌ను మూడు జోన్లుగా విభజించి, కొన్నింటిలో షరతులతో కూడిన వ్యాపారాలను అనుమతించాల్సి ఉంది. కానీ అధికారులు ఈ పాలసీని కేవలం బోర్డులకే పరిమితం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నగరంలో అసలు ఫుట్‌పాత్ ఉందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌పాత్‌ల పరిరక్షణ విషయంలో పలు సార్లు కోర్టు అక్షింతలు వేసినా, అధికారుల్లో చలనం రావటం లేదు. ఇందుకు ఒక రకంగా రాజకీయ నాయకుల ఓటు బ్యాంకు రాజకీయాలు అధికారులపై తీవ్ర స్థాయిలో వత్తిడి తెస్తున్నాయని చెప్పవచ్చు.
అంబులెన్స్ కూడా వెళ్లలేని అధ్వాన్న పరిస్థితి
ట్రాఫిక్ సమస్యకు సంబంధించి పాతబస్తీలో మాత్రం దేవుడు దిగి వచ్చినా పరిస్థితులు మారే అవకాశాలు కన్పించటం లేదు. ఫుట్‌పాత్ కబ్జాతో పాటు సగం రోడ్డును వ్యాపార సంస్థలు, తోపుడు బండ్లు కబ్జా చేసుకుని వ్యాపారాలు కొనసాగిస్తున్నందున అత్యవసర పరిస్థితుల్లో కనీసం 108, 104 వంటి అంబులెన్స్‌లు కూడా ముందుకు కదలని పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా అఫ్జల్‌గంజ్ మొదలుకుని, పత్తర్‌గట్టి, మదీనా, చార్మినార్, బహద్దూర్‌పురా, ఖిల్వత్, మొఘల్‌పురా, ఛిత్రినాఖ, తలాబ్‌కట్టా, లాల్‌దర్వాజ, ఇంజన్‌బౌలీ, ఫలక్‌నుమా తదితర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా పాదచారులు రాకపోకలు సాగించాల్సిన ఫుట్‌పాత్‌లు కబ్జాల పాలై కన్పిస్తున్నాయి. అంతేగాక, వాహనాల పార్కింగ్ కోసం మహానగర పాలక సంస్థ కేటాయించిన స్థలాన్ని సైతం కబ్జా చేసి కొందరు వ్యాపారులు షాపులను నిర్మించుకున్నా, కనీసం వారిని ప్రశ్నించేందుకు బల్దియా అధికారులు గానీ, ట్రాఫిక్ పోలీసులు గానీ ముందుకు రావటం లేదు. స్థానికంగా బాగా పలుకుబడి కల్గిన కొందరు రాజకీయ నేతల నుంచి ఎలాంటి పరిణామాలెదురవుతాయోనన్న భయంతోనే పోలీసులు పాతబస్తీలో ఫుత్‌పాత్‌లు, రోడ్లు, పార్కింగ్ స్థలాలు కబ్జా పాలవుతున్నా, చూసీచూడనట్టుగా వ్యవహారిస్తున్నారు. ట్రాఫిక్‌పై స్థానికుల్లో నెలకొన్న అవగాహన రాహిత్యం, పోలీసు ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే ఫుట్‌పాత్‌ల కనుమరుగుకు కారణం. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల అంచనాలతో ప్రతిపాదనలు సిద్ధం చేసిన సర్కారు ఫుట్‌పాత్‌ల పరిరక్షణపై కూడా దృష్టి సారించాలని పాదచారులు కోరుతున్నారు.