హైదరాబాద్

పంజా విసిరిన చలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పెథాయ్ తుపాను కారణంగా నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా గడిచిన 48 గంటల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటం, అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తున్నాయి. సోమవారం తెల్లవారుఝము ఐదు గంటలకు 28డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదు కాగా, ఎనిమిది గంటలకు 29 డిగ్రీలకు పెరిగిన ఉష్ణోగ్రతలు రాత్రి ఏడు గంటల వరకు 16 డిగ్రీలకు పడిపోయింది. చల్లటిగాలుల కారణంగా మధ్యాహ్నం నుంచే నగరంలోని పలు మెయిన్‌రోడ్లలో రాకపోకలు పలుచబడ్డాయి. రికార్డు స్థాయిలో వాతావరణం చల్లబడటంతో స్వైన్‌ఫ్లూ వ్యాధి ప్రజలను వెంటాడుతోంది. ఈ వాతావరణంలో ఏ మాత్రం అజాగ్రత్త వహించినా, రోగాల బారిన పడటం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నా, నగరంలో కనీసం వ్యాధి నివారణ చర్యలు కూడా చేపట్టడటంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమైంది. అంతేగాక, నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఎక్కువగా అంటువ్యాధులు ప్రబలే అవకాశమున్నట్లు గతంలోనే ప్రకటించిన జీహెచ్‌ఎంసీ వ్యాధుల నివారణకు ఫాగింగ్ వంటి చర్యలను ముమ్మరం చేస్తామని తెలిపినా, ఎక్కడా కూడా వ్యాధి నివారణ చర్యలు చేపట్టడం లేదు.
ఇవీ ‘స్వైన్‌ఫ్లూ’ లక్షణాలు
దగ్గు, జలుబు, తుమ్ములు, గొంతు నొప్పులు, జ్వరం, ఒళ్లు నొప్పులు, కళ్ల వెంట నీరు కారడం, నీరసంగా ఉండటంతో పాటు వాంతులు, విరోచనాలు అవుతాయి. మూడు రోజుల పాటు ఈ వైరస్ లక్షణాలు కన్పిస్తే తక్షణమే వైద్యులను సంప్రదించాలి. దీనికోసం ప్రభుత్వం గాంధీ, ఫీవర్ ఆసుపత్రితో పాటు పలు ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఉన్నాయని చెబుతున్నప్పటికీ వైద్యులు నిర్లక్ష్యమా, లేక మందుల కొరతో తెలియదు స్వైన్‌ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారు ఇక్కడకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అనుమానిత లక్షణాలతో వేలాది మంది ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేటు క్లినిక్‌లను ఆశ్రయిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
స్వైన్‌ఫ్లూ వైరస్ బారిన పడకుండా కొన్ని జగ్రత్తలు పాటిస్తే వ్యాధికి దూరంగా ఉండవచ్చు. వీలైనంత వరకు వ్యాధి సోకిన వ్యక్తులు జనసముహాల్లోకి వెళ్లకపోవడం మంచిది. ముఖ్యంగా వ్యక్తిగత శుభ్రత పాటించడం చాలా అవసరం. దగ్గినా, తుమ్మినా నోటికి క్లాత్ అడ్డుగా పెట్టుకోవడం ఫ్లూ జ్వరం లక్షణాలతో బాధపడుతున్న వారు తరచూ చేతులతో కళ్లు, ముక్కు రుద్దుకోకూడదు. వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండాలి. ఇంట్లో, పని చేసే ఆఫీసులలో అందరూ ఉపయోగించే ఫోన్లను, వస్తువులను శుభ్రపరుస్తూ ఉండాలి. వారికి చేతులు కలపడం కూడా చెయ్యకూడదు. వైరస్ సోకిన వ్యక్తి కొన్ని రోజులుగా అందరికీ దూరంగా ఉండి, చికిత్స పొందేలా చూసుకోవాలి. వ్యాధి లక్షణాలు కన్పిస్తే మామూలుగా జ్వరం, దగ్గు, తుమ్ములే కాదా అని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స చేయించుకోవడం మంచిది.