హైదరాబాద్

ఓటర్ల జాబితా ప్రచురణలో తప్పులు దొర్లకుండా చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో (జిహెచ్‌ఎంసి పరిధి)ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురణల్లో ఎటువంటి తప్పులు దొర్లకుండా ఇఆర్‌ఓలు బాధ్యతతో సవరించాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి భన్వర్‌లాల్ ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా కలక్టరేట్‌లో జిహెచ్‌ఎంసి పరిదిలోని జోనల్ కమిషనర్‌లు, డిప్యూటీ కమిషనర్లు ఆర్‌డిఓలతో ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందనరావు, జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దనరెడ్డిలతో కలిసి ఓటర్ల తుది జాబితా తయారీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షించారు. దాదాపు 5 లక్షల దరఖాస్తులు ఓటర్ల జాబితాలో చేర్చామని ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించాలని ఆయన అన్నారు. 30 లక్షలమంది ఓట్లు నకిలీవిగా పునరావృతం, చనిపోయినవారి ఓట్లుగా గుర్తించామన్నారు. ఇఆర్‌వోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఓటర్ల జాబితా తయారుచేయాలని, జాబితా సవరణలో గుర్తించిన నకిలీ, పునరావృతం, చనిపోయిన ఓటర్ల వివరాలను ఇంటింటి సర్వేద్వారా ధృవీకరించాలని సూచించారు. విచారణ సమయంలో ఇంటికి తాళం ఉన్న ఓటర్లకు సంబంధించి బిఎల్‌ఓ పోను నెంబర్లు కలువవలసిన సమయం, స్థలం వివరాలను పొందుపర్చాలని, ప్రతి పోలింగ్ స్టేషన్‌లో బూత్ స్థాయి అధికారని తప్పనిసరిగా నియమించాలని బిఎల్‌ఓలకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ మార్చడం లేదా కొత్తవారిని నియమించినప్పుడు తప్పనిసరిగా సిఇవో వెబ్‌సైట్‌లో మార్పులు చేయాలని ఆదేశించారు. ఇంటింటి ధృవీకరణ నిమిత్తం బిఎల్‌ఓలు కనీసం మూడుమార్లు సంప్రదించాలని ఓటరు బిఎల్‌ఓను సంప్రదించని పక్షంలో నోటీసు జారీ చేయాలని సూచించారు. బిఎల్‌ఓలకు ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో సంబంధిత పోలింగ్ స్టేషన్ వివరాలు, ఓటర్ల జాబితా వారికి ఇవ్వాలని సూచించారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ పరిశీలనకు వెళ్లే బూత్‌స్థాయి అధికారులకు పూర్తి వివరాలు, మాట్లాడే అంశాలపై ముందుగానే సమాచారం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఓటర్లను సంప్రదిస్తే వారి సంతకం తీసుకుంటారని, ఓటర్లను సంప్రదించని పక్షంలో బిఎల్‌ఓ వివరాలతో ఉన్న స్టిక్కర్‌ను ఇంటికి అంటిస్తారని తెలిపారు.
కలెక్టర్ రఘునందనరావు మాట్లాడుతూ ఇఆర్‌ఓలు జాబితా వివరాలు కంప్యూటర్‌లో నమోదుచేసేముందు సరిచూడాలన్నారు. ప్రతి ఓటరు వివరాలు పోలింగ్ స్టేషన్లవారిగా సరిచూడాలన్నారు. బిఎల్‌ఓలకు నగదు డిబిటి ద్వారా వారి ఖాతాలో జమచేస్తామన్నారు. ఈ సమావేశంలో అడిషనల్ సిఇఓలు అనూప్‌సింగ్, గౌరవ్‌ఉప్పల్, జాయింట్ కలెక్టర్ ఆమ్రపాలి, అడిషనల్ కమిషనర్లు హరిచందన, సురేందర్ మోహన్, డిఆర్‌ఓ ధర్మారెడ్డి, ఆర్‌డిఓలు సురేష్ పొద్దార్, సుధాకరరావు, ఎన్నికల విభాగం తహసీల్దారు జ్ఞాన ప్రసూనాంబ తదితరులు పాల్గొన్నారు.