హైదరాబాద్

సీఎస్- 7 భూముల స్వాధీనానికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: దీర్ఘకాలికంగా కోర్టు విచారణలో కొనసాగుతున్న సీఎస్ (సివిల్ సూట్) 7 భూముల వివాదం దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాలతో కోట్ల విలువైన భూములు ప్రభుత్వానికి దక్కాయి. శేరిలింగంపల్లి తహశీల్దార్‌పై నమోదైన కోర్టు ధిక్కరణ కేసుతో ఈ సమస్యకు పరిష్కారం దక్కినట్లు అయింది. హైకోర్టులో కొనసాగిన భూ వివాదాలపై కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై తహశీల్దార్ అమలు చేయడం లేదంటూ.. ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన హైకోర్టు అప్పటి తహశీల్దార్ తిరుపతిరావుకు రెండు నెలల జైలు శిక్షతో పాటు రూ.15 వందల జరిమానా విధించినది. దీనిపై తహశీల్దార్ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా ధర్మాసనం తహశీల్దార్‌పై ఉన్న కోర్టు ధిక్కరణ కేసును కొట్టేసింది. ఈ భూ వివాదంపై సమగ్ర విచారణ జరిపిన ధర్మాసనం సీఎస్ 7 పైగా భూములు ప్రభుత్వానివేనని తేల్చి చెప్పింది. దీనిపై కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ, వారి అభ్యర్ధనను తోసిపుచ్చింది. దీంతో రాయదుర్గం సర్వే నెంబర్ 14లోని 84 ఎకరాల 30 గుంటల భూమి, సెమ్సిగూడలోని సర్వే నెంబర్ 57లోని 274 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రభుత్వం సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధపడింది. ఇందులో భాగంగా సోమవారం రాయదుర్గంలోని సర్వే నెంబర్ 46లోని భూములను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి, సినీనటుడు ప్రభాస్ ఏర్పాటు చేసుకున్న గెస్టుహౌజ్‌ను రెవెన్యూ యంత్రాంగం సీజ్ చేసింది. అయితే సదరు భూమి ప్రభుత్వానిది కావడంతో తమ అధీనంలో ఉన్న భూమిని క్రమబద్ధీకరించాలని జీవో 59 ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రభాస్ ఇప్పటికే కోర్టుకు కోటీ 20 లక్షల రూపాయలను ప్రభుత్వానికి చెల్లించినట్లు తెలిసింది. ఈ దరఖాస్తును పరిశీలించిన రెవెన్యూ యంత్రాంగం అప్పటికే కోర్టులో విచారణ కొనసాగుతుండటంతో దరఖాస్తును తిరస్కరించినట్లు సమాచారం. ఇదిలావుండగా షంషీగూడలోని సర్వే నెంబర్ 57లోని ఖాళీ స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై సమీక్షించిన ముఖ్యమంత్రి కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ స్థలాలన్ని ఎవరి అధీనంలో ఉన్నా వదలొద్దని, వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించినట్లు సమాచారం.