హైదరాబాద్

చేనేతకు చేయూత ఇచ్చేందుకు పర్వతారోహణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: చేనేత, చేనేత కళాకారులను ప్రోత్సాహాన్ని అందించే నిమిత్తం నగరానికి చెందిన మహిళలు పర్వాతరోహణ చేశారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పర్వతారోహణ చేసిన రాజి వెంకట్, లావణ్యలు వివరాలను వెల్లడించారు. ఎంతో శ్రమించి చేనేత వస్త్రాలు రూపొందిస్తున్నా సరైన ప్రోత్సాహం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తాము ఈ యాత్రకు సన్నద్ధం అయినట్టు చెప్పారు. హసిత(13), సృజన, చిన్నారి సమన్యుతో కలిసి ఈనెల 8న ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు బయలుదేరినట్టు చెప్పారు. ఈనెల 12న సిడ్ని నగరానికి చేరువలో ఉన్న 7000 అడుగుల ఎత్తుగల కొజెస్కో పర్వతాన్ని చీరలు ధరించి అధిరోహించినట్టు తెలిపారు. ఇక్కడి చీరల ప్రశస్థ్యాన్ని యావత్ ప్రపంచానికి వివరించే నిమిత్తం ఈ పర్వతారోహణ చేసినట్టు వివరించారు.