హైదరాబాద్

‘బాబాసాహెబ్ అంబేద్కర్’ నృత్యరూపకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత విశేషాలతో గురువారం ఆదర్శనగర్ సాయికళా మందిరంలో ‘బాబాసాహెబ్ అంబేద్కర్’ నృత్యరూపాకాన్ని ప్రదర్శించారు. శ్రీసత్య కళానికేతన్ ఆధ్వర్యంలో సంస్కృతి ఆర్ట్స్ సమర్పించిన కార్యక్రమం సమైఖ్యతను ప్రబోధిస్తూ ‘మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్య’ అనే గీతంతో ప్రారంభించారు. గీతంలో యేసు, బుద్ధుడు, అల్లాను స్మరిస్తూ సర్వమానవ సౌభ్రాతృత్వం అంటూ చిన్నారులు నృత్యం చేశారు. భారత రాజ్యాంగ సృష్టికర్తగా పూడమి ఉన్నంత కాలం మరువము నీ త్యాగం అంటూ నాట్యాచారిణి సంస్కృతి అభినయంలో అంబేద్కర్ సేవలను నాటకీయంగా ప్రదర్శించారు. కళలకు కులమతాలు అడ్డురావని, ప్రాంతీయ భేదాలు లేవని తెలియజేస్తూ ‘స్వాగతమ్ము ఆంధ్ర వీరుడా సుస్వాగతమ్ము ఆంధ్ర సోదరా..’ గీతంతో నృత్య కార్యక్రమాన్ని ముగించారు. కళాకారులను ముఖ్యఅతిథిగా విచ్చేసిన విశ్రాంతి ఐఎఎస్ అధికారి చంద్రశేఖర్‌రావు సత్కరించారు.