హైదరాబాద్

యువత ముందు ఎన్నో సవాళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: గ్లోబలైజేషన్, ఆధునికత నేపథ్యంలో ప్రస్తుతం యువత ముందు ఎన్నో సవాళ్లున్నాయని, యువత వాటిని చాకచక్యంగా ఎదుర్కొని నేటి అవసరాలను గుర్తించి ముందుకెళ్లాలని హైదరాబాద్ మెట్రోరైలు మేనేజింగ్ డైరెక్టర్ డా.ఎన్వీఎస్‌రెడ్డి అన్నారు. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో సరికొత్త మార్పులు’ అంశంపై నగరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు సోమవారం మూడోరోజు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ట్రక్చరల్ ఇంజనీర్లు నేడు అన్ని రంగాల్లో పెరుగుతున్న పోటీని దృష్టిలో పెట్టుకుని సామాజిక దృష్టిలో ఆలోచన చేయాల్సిన అవసరముందన్నారు. రోజురోజుకి పెరుగుతున్న ప్రపంచ జనాభా, మారుతున్న జీవన విధానాలు, అంతరించి పోతున్న ప్రకృతి వనరులు, గ్లోబల్ వార్నింగ్ వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. హైదరాబాద్ మెట్రోరైలు కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకెళ్తుందన్నారు. ఇందులో 35 శాతం ఇంజనీరింగ్ సంబంధిత సవాళ్లుండగా, మరో 65 శాతం నాన్ ఇంజనీరింగ్ సవాళ్లను ఎదుర్కొందన్నారు. హైదరాబాద్ నగరానికి తగిన విధంగా డిజైనింగ్‌ను ఎకో ఫ్రెండ్లీ పద్దతిన రీ డిజైనింగ్ చేశామన్నారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి కెసిఆర్ విజన్‌కు అనుకూలంగా నేడు మెట్రో పనులు ముందుకెళ్తున్నాయని వివరించారు. ఈ సదస్సులో ఎన్వీఎస్‌రెడ్డితో పాటు ఐఐటి సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రో.కెవిఆర్. సుబ్రహ్మణ్యం, యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ ప్రో.ఎస్. రామచంద్రం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రో.్భక్షం తదితరులు పాల్గొన్నారు.