హైదరాబాద్

కమనీయం రమణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: శ్రీరామ నవమిని పురస్కరించుకుని శ్రీ రామభక్త సమాజం ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం కమనీయం గా..రమణీయంగా జరిగింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడు కూడా ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్న నిర్వాహకులు శుక్రవారం స్వామివారి కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామి కల్యాణాన్ని తిలకించి తరించారు. నాంపల్లి పరిసర ప్రాంతాల నుంచే గాక, నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, సాహితీవేత్తలు, రచయితలు ఈ వేడుకకు తరలివచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భాజాభజంత్రీలతో వేదిక ఆవరణలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మాదిరిగానే ఉదయం ప్రత్యేక పూజాధికాలను నిర్వహించినానంతరం నాంపల్లి గూడ్స్ గేటు వద్దనున్న శ్రీ రామ హనుమాన్ మందిరం ఆవరణలో సర్వాంగ సుందరంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీరామ భక్త సమాజము తరపున చల్లపల్లి వేంకటచలపతిరావు నేతృత్వంలో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనము కార్యక్రమాలను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్తంగా, సంప్రదాయంగా నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం పదిన్నర గంటల నుంచి పనె్నండున్నర గంటల మధ్య వధూవరులు సీతారాములను ఊరేగింపుగా వివాహ మండపం వద్దకు తీసుకువచ్చి కల్యాణం నిర్వహించి, తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చిన భక్తులు స్వామివారికి కట్న కానుకలను చదివించుకున్నారు. మాజీ డిజిపి దినేష్‌రెడ్డి వివాహమహోత్సవానికి హాజరై స్వామివారికి తన తరపున రూ. 300లను చదవించారు. నేత్రపర్వంగా జరిగిన ఈ కల్యాణం మొదటి నుంచి ముగింపు వరకు శ్రీ రామభక్తి సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కల్యాణం అనంతరం వేలాది మంది భక్తులకు సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీ సీతారాములను పూల పల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. నాంపల్లి గూడ్స్‌గేటు వద్దనున్న హనుమాన్ మందిరం ఆవరణ నుంచి బయల్దేరిన ఊరేగింపు దేవీబాగ్ దేవాలయం మీదుగా నాంపల్లి మార్కెట్, ప్రభుత్వాసుపత్రి తదితర ప్రాంతాల్లో కొనసాగి తిరిగి దేవాలయానికి చేరుకుంది. ఆ తర్వాత చెండ్లాడింపు, మేజువాణి కార్యక్రమాల్ని ఘనంగా నిర్వహించారు.
నేడు పట్ట్భాషేకం
శ్రీ సీతారాముల వసంత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం నిర్వహించిన మరుసటి రోజైన శనివారం ఉదయం పది గంటలకు శ్రీరామ పట్ట్భాషేకం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకుడు చల్లపల్లి వేంకటచలపతిరావు తెలిపారు. రాత్రి ఏడున్నర గంటలకు శ్రీ సీతారాములను శే్వతాశ్వ రథములో ఊరేగించనున్నట్లు, ఆ తర్వాత పదిన్నర గంటలకు పవళింపు సేవ, దంపతి తాంబూల కార్యక్రమాల్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 18వ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు ద్వాదశిపారణ కార్యక్రమం అనంతరం ఈ ఉత్సవాలను ముగించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.