హైదరాబాద్

ఆదర్శంగా నిలుస్తున్న తెలంగాణ జైళ్ల శాఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సైదాబాద్: వివిధ రంగాలలో అంచనాలకు మించి విజయాలు సాధించటంతో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకే కాకుండా తెలంగాణలోని ఇతర ప్రభుత్వ శాఖలకు జైళ్ల శాఖ ఆదర్శంగా నిలుస్తుందని డీజీ వీకే సింగ్ అన్నారు. వివిధ రాష్ట్రాల జైళ్లశాఖల అధికారులే కాకుండా శ్రీలంక, అమెరికా దేశాల ప్రతినిధులు సైతం తెలంగాణ జైళ్లను సందర్శించారని పేర్కొన్నారు. గురువారం చంచల్‌గూడాలోని జైళ్లశాఖ సీకా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డీజీ వీకే సింగ్, ఐజీ ఆకుల నర్సింహా, డీఐజీ సైదయ్యతో కలిసి జైళ్లశాఖ గత సంవత్సరం వార్షిక నివేదికను వెల్లడించారు. తెలంగాణ జైళ్లశాఖ ఆర్ధికస్వాలంబన సాధించటంలో పురోగమిస్తుందని చెప్పారు. 2013లో కోటిన్నర రూపాయల ఆదాయం ఉన్న జైళ్ల శాఖ 2018లో పెట్రోల్ పంపుల నిర్వాహణ సహా అన్ని విభాగాల నుంచి రూ.495కోట్ల టర్నోవర్ కలిగి రూ.17కోట్ల నికర లాభాలను సాధించిందని పేర్కొన్నారు. 100 పెట్రోల్ బంక్‌ల స్థాపనతో 1000 మంది ఖైదీలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్టవ్య్రాప్తంగా ఏ జైలులోను ఖైదీల పరారీ సహా ఏ చిన్న సంఘటన చోటు చేసుకోలేదని తెలిపారు. 2014లో జైళ్లలో అనారోగ్యంతో 56 మంది చనిపోగా, 2018లో ఎనిమిది మంది మాత్రమే మరణించారని చెప్పారు. ఖైదీల ఆరోగ్యం కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేశామని అన్నారు. 2018లో కేవలం ఒక్క సంఘటన తప్పితే జైళ్లశాఖ అవినీతి రహిత శాఖగా నిలిచిందని తెలిపారు. మూడు సంవత్సరాల్లో 197 మంది ఖైదీల కుటుంబ సభ్యులకు వివిధ అవసరాల నిమిత్తం రూ.50లక్షలు రుణాలు ఇప్పించామని పేర్కొన్నారు. భిక్షగాళ్లు లేని నగరంగా తీర్చిదిద్దేందుకు పలు వీధుల నుంచి ఏడువేల మందికి జైళ్ల శాఖ ఆధ్వర్యంలోని ఆనంద ఆశ్రమానికి తరలించామని వివరించారు. గత సంవత్సరం రాష్టవ్య్రాప్తంగా 12 వేల మంది డ్రంకెన్‌డ్రైవ్‌లో పోలీసులకు చిక్కి జైళ్లకు వచ్చారని పేర్కొన్నారు. తెలంగాణ జైళ్లలో 299 మంది పీడీ యాక్ట్ నేరస్థులు ఉన్నారని తెలిపారు. జైళ్లశాఖ అధికారులు సిబ్బంది విశేష కృషితోటే ఇది సాధించామని వివరించారు. ఈ సంవత్సరం జైళ్లశాఖ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, విద్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తామని అన్నారు.