హైదరాబాద్

పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అసలే స్వచ్ఛ సర్వేక్షణ్-2019 జరుగుతున్న కీలక సమయం..ఈ సమయంలోనూ నగరంలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా మారాయి. ముఖ్యంగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎప్పటికపుడు స్వీపింగ్ చేసేందుకు వీలుగా మూడు ఒక్కో గ్రూప్‌లో ఏడుగురు కార్మికులు, ప్రతి మూడు గ్రూప్‌లకు ఓ ఎస్‌ఎఫ్‌ఏను నియమించినా, అత్యధిక ప్రాంతాల్లో మూడు షిఫ్టుల్లో పారిశుద్ద్య పనులు కొనసాగటం లేదు. తెల్లవారుఝ ఆరు గంటల నుంచి మధ్యాహ్నాం మూడు గంటల వరకు ఓ షిఫ్టు, మూడు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు మరో షిఫ్టు, రాత్రి పదకొండు నుంచి తెల్లవారుఝము ఆరు గంటల వరకు మూడో షిఫ్టులో పారిశుద్ధ్య పనులు కొనసాగాల్సి ఉండగా, కొన్ని ప్రాంతాల్లో కేవలం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నాం పనె్నండు గంటల వరకు మొదటి షిఫ్టు,మరికొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నాం, రాత్రి పూట షిఫ్టుల్లో పారిశుద్ద్య పనులు పత్తాలేకుండా పోయాయి. ఎస్‌ఎఫ్‌ఏలు, శానిటరీ సూపర్‌వైజర్లు, మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్ల కుమ్మక్కు వల్లే ఈ తతంగం జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. కేవలం జన సంచారమెక్కువగా ఉండే బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, పలు ముఖ్యమైన ప్రభుత్వ ఆఫీసుల వద్దనే మూడు షిఫ్టుల్లో స్వీపింగ్ కార్మికులు విధులు నిర్వహిస్తుండగా, మిగిలిన ప్రాంతాల్లో స్వీపింగ్ యూనిట్ల పనితీరు, క్షేత్ర స్థాయి పర్యవేక్షణ నిమిత్తం నియమించిన శానిటరీ సూపర్‌వైజర్, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు, మెడికల్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్‌లతో అయిదు అంచెల వ్యవస్థ ఏర్పాటు చేసినా, ఎక్కడా కూడా పర్యవేక్షణ సక్రమంగా జరగటం లేదు. ఏడుగురు కార్మికులతో ఒక్కో గ్రూప్‌ను ఏర్పాటు చేయాల్సి ఉండగా, చాలా గ్రూప్‌లో నలుగురు, ఐదుగురు కార్మికులే పనిచేస్తున్నారు.
అలాగే ప్రతి మూడు గ్రూప్‌లకు ఓ శానిటరీ ఫీల్డు అసిస్టెంటు పర్యవేక్షించాలన్న నిబంధన ఉండగా, కొన్ని ప్రాంతాల్లో ఒక ఎస్‌ఎఫ్‌ఏకు ఐదు నుంచి ఎనిమిది, పది గ్రూప్‌లను కట్టబెట్టారు. ఫలితంగా క్షేత్ర స్థాయిలో పారిశుద్ద్య పనుల పర్యవేక్షణ సక్రమంగా జరగటం లేదు. ఫలితంగా కుప్పలు కుప్పలుగా చెత్త పేరుకుపోయింది. ప్రస్తుతం స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 సర్వేను పురస్కరించుకుని స్వచ్ఛ్భారత్ మిషన్ ఉన్నతాధికారుల బృందం త్వరలోనే నగరాన్ని సందర్శించి పారిశుద్ద్యం, స్వచ్ఛ కార్యక్రమాలను పరిశీలించనున్నందున చాలా ప్రాంతాల్లో ఈ షిఫ్టులు అదనంగా పని చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు నిర్వర్తించాల్సిన విధులను పక్కనబెట్టినందుకే ఇపుడు కుప్పలు, కుప్పలుగా చెత్తను తొలగించాల్సి వస్తోంది. పైగా ఏడాది మొత్తంలో స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే జరిగే ఒక నెల రోజులు మాత్రమే కార్మికులు, అధికారులు పారిశుద్ద్య విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారని, మిగిలిన పదకొండు నెలలు విధులు ఇష్టారాజ్యంగా మారాయన్న విమర్శ లేకపోలేదు.
నగరంలోని ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు సుమారు 3వేల స్వచ్ఛ ఆటో టిప్పర్లను సమకూర్చి, ఒక్కో టిప్పర్‌కు ఇద్దరు కార్మికులను నియమించారు. ఇంటికొచ్చి చెత్త సేకరించే వారికి ప్రతి ఇంటి నుంచి నెలకు రూ. 50 తీసుకోవచ్చునని, అడిగి తీసుకోవాలంటూ బల్దియా అధికారులు సర్క్యులర్ కూడా జారీ చేశారు. ఇదే అదునుగా ప్రతి ఇంటి నుంచి డిమాండ్ చేసి మరీ డబ్బు వసూలు చేసుకుంటున్న కార్మికులు కనీసం రెండురోజులకోసారి కూడా చెత్తను సేకరించేందుకు రావటం లేదని ప్రజలు లబోదిబోమంటున్నారు. మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెహిదీపట్నం, పొరుగు డివిజన్ అహ్మద్‌నగర్‌లో కార్మికులు కేవలం డబ్బుల కోసమే వస్తున్నారని, చెత్త సేకరణకు రావటం లేదని స్థానికులు ఆరోపించారు.