హైదరాబాద్

బల్దియా బడ్జెట్‌కు స్థారుూ ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థ రానున్న ఆర్థిక సంవత్సరం(2019-2020)కు సంబంధించి రూ. 6150 కోట్లతో రూపకల్పన చేసిన బడ్జెట్ ముసాయిదాకు గురువారం జరిగిన స్థారుూ సంఘం సమావేశం ఆమోదం తెలిపింది. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యులు బడ్జెట్‌పై విస్త్రృతంగా చర్చ జరిగిన అనంతరం స్థారుూ సంఘం బడ్జెట్‌ను ఆమోదించింది. అంతేగాక, త్వరలోనే కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి, వచ్చే నెల 20వ తేదీలోపు ఆమోదం నిమిత్తం సర్కారుకు పంపాలని నిర్ణయించారు. ఇదివరకే గత నెల 20వ తేదీన స్థారుూ సంఘంలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి, గురువారం మరోసారి చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత సంవత్సరం నుంచి జీహెచ్‌ఎంసీ మూడు అంశాల ప్రాతిపదికన బడ్జెట్‌ను రూపకల్పన చేస్తోంది. అందులో జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్(హెచ్‌ఆర్‌డీసీ), ఇతర మేజర్ ప్రాజెక్టులు హెడ్‌తో బడ్జెట్‌ను రూపొందించారు. ఇందులో వర్తమాన ఆర్థిక సంవత్సరం(2018-19)కు సంబంధించి అధికారులు జీహెచ్‌ఎంసీకి రూ. 6076.86 కోట్లతో ఆమోదిత బడ్జెట్‌ను రూపొందించగా, దాన్ని రూ. 5375 కోట్లకు సవరించారు. రానున్న ఆర్థిక సంవత్సరం(2019-2020)కి గాను రూ. 6150కోట్లతో ప్రతిపాదిత బడ్జెట్‌ను తయారు చేశారు. మొత్తం మూడు హెడ్‌లతో కలిపి రూ. 11538 కోట్లతో ప్రతిపాదిత బడ్జెట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మేజర్ ప్రాజెక్టులకు రూ. 5388 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు.