హైదరాబాద్

ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర ‘ఎన్టీఆర్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : అన్ని వర్గాల ప్రజల గుండెల్లో చెరగని ముద్ర ఎన్టీఆర్ అని, అందర్నీ అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ పేదలకు ఎంతో ప్రయోజాన్ని చేకూర్చుతున్నాయని టీడీపీ నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ రావు అన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ 23వ వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం రసూల్‌పురా చౌరస్తా నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు నిర్వహించిన అమరజ్యోతి ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న తెలుగు తమ్ముళ్లు, ఆ తర్వాత నగర పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. నగర అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతి ఎన్టీఆర్ అని కొనియాడారు. రాజకీయాలకు కొత్త నిర్వచనం చెప్పిన మహానీయుడు, యుగ పురుషుడు ఎన్టీఆర్ లేని లోటు పేద ప్రజలకు ఎప్పటికీ తీరని లోటు అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ప్రజలకు దూరమై 23 ఏళ్లు గడుస్తున్నా, నేటికీ వరకు ఆయనకు ఎవరి సరి రాలేరని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు వనం రమేశ్, నల్లెల్ల కిషోర్‌కుమార్, పీ. అశోక్, యాదగిరిరావు, శరణ్‌కుమార్, మహిళా నాయకురాలు అన్నపూర్ణ హాజరయ్యారు. తెలుగు తమ్ముళ్లు నగరంలోని అన్ని డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘అమరజ్యోతి’ పేరిట ప్రత్యేక సామాజిక కార్యక్రమాలను నిర్వహించి, ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.