హైదరాబాద్

ఐక్యతతో ఏదైనా సాధించొచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : ఏ వర్గం ప్రజలైనా ఐక్యతగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కే.రాములు అభిప్రాయపడ్డారు. జలమండలిలోని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను శుక్రవారం జలమండలి ఆఫీసులో ఆవిష్కరించారు. రాములు మాట్లాడుతూ ప్రమాదవశాత్తు మ్యాన్‌హోళ్లలో పడి మృతిచెందే కార్మికుల బాధిత కుటుంబాలకు రూ. 20లక్షల నష్టపరిహారం అందించేలా ఎస్సీ కమిషన్ ఏర్పాట్లు చేసిందని వివరించారు. పదోన్నతుల విషయంలోనూ ఎస్సీలకు అన్యాయనం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అన్ని శాఖల్లో ఎస్సీ, ఎస్టీ పట్ల ఇంకా వివక్ష కొనసాగుతుందని, అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించుకోవచ్చునన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. జలమండలి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ మాట్లాడుతూ జలమండలి నగరంలోని సుమారు 1.2 కోట్ల మందికి అందిస్తున్న సేవలు క్షేత్ర స్థాయిలో ఉండే కార్మికులతో సజావుగా అందుతున్నాయని అన్నారు. కార్మికుల కృషి, శ్రమతో జలమండలికి అనేక అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు. ఎస్సీ, ఎస్టీలకు ఏమైనా సమస్యలుంటే బోర్డుకు తెలియజేస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్టు-1 డైరెక్టర్ ఎం.ఎల్లాస్వామి, ఆపరేషన్-1 డైరెక్టర్ అజ్మీరా కృష్ణతో పాటు అసోసియేషన్ అధ్యక్షుడు బి. భూమయ్య, జనరల్ సెక్రటరీ బీఆర్ శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ సీ.రాజు, బీ.జ్ఞానేశ్వర్, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎం.రాజా, కోశాధికారి పీ.కృష్ణ, ప్రతినిధులు ఎంఎన్ శేఖర్, యూనియన్ నేతలు పాల్గొన్నారు.