హైదరాబాద్

డెంటల్ ఇంప్లాంటేషన్ చరిత్రలో కొత్త అధ్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ, : హ్యాపీ స్మైల్ హాస్పిటల్ స్థాపించి పదేళ్లు పూర్తియిన సందర్భంగా డెంటల్ ఇంప్లాంటేషన్ చరిత్రలోనే నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టామని హ్యాపీ స్మైల్ మల్టీస్పేషాలిటీ డెంటల్ హాస్పటల్ అండ్ ఇంప్లాంట్స్ సెంటర్ అధినేత ప్రముఖ దంత నిపుణుడు డా. ఏ.చంద్రశేఖర్ తెలిపారు. హాస్పటల్ పదో వార్షికోత్సవం సందర్భంగా కేవలం మేటీరియల్ ఖర్చుతో డెంటల్ ఇంప్లాంటేషన్ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ హ్యాపీ స్మైల్ ఓరల్ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టామని వివరించారు. ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మొదటిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న రెండు వేల మందికి ఉచిత కన్సల్టేషన్ అవరమైన వారికి కేవలం మెటీరియల్‌కు అయ్యే ఖర్చుతో ఇంప్లాంటేషన్ చేస్తామని తెలిపారు. మిగిలిన ఖర్చు హ్యాపీ స్మైల్ ఓవర్ హెల్త్ ఫౌండేషన్ భరిస్తుందని పేర్కొన్నారు. దంత వైద్యంలో అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సలు, ఇంప్లాంట్స్ అమరిక ద్వారా ముఖాకృతి అందంగా తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసంతో అడుగులేసేలా చేయవచ్చని అన్నారు. దంత సంరక్షణపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. జంట నగరాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశంలో డాక్టర్లు ఏ.రేఖా, కే.శ్రవణ్ కుమార్, నితిన్ కుమార్ పాల్గొన్నారు.

ఓటరు జాబితా పరిశీలన, నమోదు
మెహిదీపట్నం, జనవరి 18: ఓటరు జాబితాను పరిశీలించి ఓటు లేకుంటే వెంటనే నమోదు చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మీ తెలిపారు. శుక్రవారం కార్వాన్ నియోజకవర్గంలోని లంగర్‌హౌస్ రింగ్‌రోడ్‌లోని గ్రాండ్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఓటరు జాబితా పరిశీలన - నమోదు కార్యక్రమానికి బిఎల్‌ఓల సమావేశం ఏర్పాటు చేశారు. కొత్తగా ఓటు నమోదు చేసుకునేవారు దరఖాస్తు పెట్టుకోవాలని పేర్కొన్నారు. అనంతరం సర్కిల్-13 డిప్యూటీ కమిషనర్ సుదాన్షు మాట్లాడుతూ, ఓటరు లిస్టును క్షణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎలాంటి అవకతవకలు జరుగకుండా బిఎల్‌ఓలు పనిచేయాలని పిలుపు నిచ్చారు. ఓటు నమోదు చేసుకుంటే వెంటనే వారిని పరిశీలించి ఓటరు లిస్టులో పేరును నమోదు చేయాలని పేర్కొన్నారు. 19, 20తేదీల్లో ఉదయం పది గంటల నుంచి ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాల్లో బీఎల్‌ఓలు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతుందని సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు బిఎల్‌ఓలు ఓటరు నమోదు కేంద్రాలలో ఉండాలని పేర్కొన్నారు. అంతేకాకుండా ఒకే ఇంట్లో 30 ఓట్లు ఉంటే వెంటనే ఆ ఇంటిని తనిఖీ చేయాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఈఆర్‌ఓ వీ. గోపి, లిలిత కుమారి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు మిస్ కాకుండా తమ ఓటరు లిస్టులను పరిశీలించాలని సర్కిల్-12 డిప్యూటీ కమిషనర్ ఎం.ఎన్‌క్కాషా అలీ అన్నారు. శుక్రవారం ఉదయం మెహిదీపట్నంలోని జీఎం గార్డెన్‌లో ఓటరు జాబితా పరిశీలన- నమోదు కార్యక్రమం బీఎల్‌ఓలతో ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బోగస్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని తమకు ఫిర్యాదు వచ్చిందని, తమ ఓట్లు కూడా గల్లంతు అయ్యాయని కొందరు ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. దీంతో ఓటరు లిస్టులో తమ పేరు చూసి, లేనిపక్షంలో వెంటనే తమ పేరును నమోదు చేసుకోవాలని పిలుపు నిచ్చారు. కొత్తగా నమోదు చేసుకునే వారు కూడా తమ పేరును నమోదు చేసుకోవాలని తెలిపారు. టీఆర్‌ఎస్ నాంపల్లి ఇన్‌చార్జి సీహెచ్ ఆనంద్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీఎల్‌ఓలు ఇంటింటికీ తిరిగి ఇంట్లోని అందరి ఓట్లు ఉన్నాయా లేదా లేని పరిశీలించాలని పేర్కొన్నారు. ఓట్లు గల్లంతయిన విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకవెళ్లినట్లు వెల్లడించారు.

సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలి
హైదరాబాద్, జనవరి 18: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు సకాలంలో చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని, గైర్హాజారు అవతున్న వైద్యులపై కఠినంగా వ్యవహరించాలని వైద్య ఆరోగ్య శాఖాధికారులను హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జీ.రవి ఆదేశించారు. ప్రభుత్వ అసుపత్రుల్లో మేరుగైన వసతులను కల్పించి, సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సకాలంలో చేరుకుని విధులకు హాజరుకావాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల విధులపట్ల జిల్లా వైధ్య ఆరోగ్య శాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికపడు తనిఖీలు చేయాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులో సిబ్బంది, వైద్యుల హజరు ప్రత్యేకంగా తనిఖీ చేయాలని ఆదేశించారు. నగరంలో సీజనల్ వ్యాదుల వ్యాప్తి అధికంగా ఉన్న సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న సిబ్బంది, వైద్యులకు సేలవులు ఇవ్వకూడదని సూచించారు. నాంపల్లిలోని హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి వెంకట్‌తో కలిసి సాధారణ ప్రసవాలు, ఇమ్యూనైజేషన్, కుటుంబ నియంత్రణ, సంక్షేమం, ఆర్బిఎస్‌కె, కేసీఆర్ కిట్ల పంపిణీ, కంటి వెలుగు, టీబీ, ఎయిడ్స్ వంటి ఇతర అంశాలపై వైద్య ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షించారు. ఇన్‌చార్జి కలెక్టర్ రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల శాతం పెంచడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి తదనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలలో మొదటి మూడు నెలల లోపు తప్పనిసరిగా గర్భిణుల నమోదు శాతం పూర్తయ్యేలా వైద్య శాఖాధికారులు చర్య తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ కిట్లు అర్హులైన వారందరికీ అందేలా చూడాలని పేర్కొన్నారు. హైరిస్క్ ఉన్న కేసులను గుర్తించి మెరుగైన చికిత్స కోసం చర్యలు తీసుకోవాలని ఎస్‌పీహెచ్‌ఓలను ఆదేశించారు. మెడికల్ అధికారులు ఎఎన్‌ఎంలు, ఆశావర్కర్లతో ఎస్‌పీహెచ్‌ఓలు చురుకుగా పనిచేసి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వైద్య ఆరోగ్య పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని తెలిపారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రులపట్ల నమ్మకం కలిగేలాగా అంకితభావంతో పనిచేయాలని అన్నారు. డాక్టర్లు సమయ పాలన పాటిస్తూ సత్వరమే స్పందించి వైద్యం అందించాలని సూచించారు. అంగన్ వాడీ సెంటర్లలో అర్బిఎస్‌కే టీముల ద్వారా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి గుర్తించిన వారికి అవసరమైన శస్తచ్రికిత్సలు దగ్గరుండి చేయించాలని అర్బిఎస్‌కే కోఆర్డినేటర్ శ్రీకళను ఆదేశించారు. ప్రజలలో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల నమ్మకం కలిగేలా అంకితభావంతో పనిచేయాలని, సరిగ్గా పనిచేయని వైద్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాధి నిరోదక టీకాలను శిశువులకు సకాలంలో అందించి శిశు మరణాల శాతాన్ని అగ్గించాలని సూచించారు. జాతీయ టీబీ నివారణ కార్యక్రమం క్రింద మల్టీ డ్రగ్స్ చికిత్స పొందుతున్న రోగులకు పోషకాహారం తీసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.500లు ఆర్థిక సహాయాన్ని వెంటనే వారి ఖాతాలో జమ ఆయ్యేలా చర్యలు తీసుకోవలని టీబీ కంట్రోలింగ్ అధికారి చల్లాదేవిని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో పాల్గొన్న జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకటి మాట్లాడుతూ ఎస్పీహెచ్‌ఓలు సంబధిత పీహెచ్‌సీ డాక్టర్లు, మెడికల్ అధికారులు, ఆశా, ఎఎన్‌ఎంలతో ఎప్పటికపుడు సమన్వయ సమావేశం నిర్వహిస్తూ గర్భిణులను మొదటి మూడు నెలలలోగా రిజిష్టరు చేసి ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు అయ్యేలా చూడాలని పేర్కొన్నారు. డాక్టర్లు అంకిత భావంతో పనిచేసి మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. సమావేశంలో అదనపు డీఎం అండ్ హెచ్‌ఓ సరళ కుమారి, డీఐఓ నాగార్జున, ఏయిడ్స్ కంట్రోలింగ్ అధికారి నిర్మల ప్రభావతి, ఎస్పీహెచ్‌ఓలు పాల్గొన్నారు.