హైదరాబాద్

రెండు రాష్ట్రాల్లో ఓటు ఉండటం నేరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మళ్లీ ఎన్నికల సందడి నెలకొంది. సరిగ్గా 40 రోజుల ముందు వరకు కూడా శాసనసభ ఎన్నికల్లో బిజీబిజీ ఉన్న బల్దియా ఇపుడు ఎంపీ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలు కానుంది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ శనివారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్‌లోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఓటరు నమోదు అధికారులతో ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఒకే వ్యక్తి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓటరుగా నమోదు చేసుకోవటం నేరమని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న ఎంపీ ఎన్నికల ఏర్పాట్లలో సిబ్బంది, అధికారులు తగిన జాగ్రతలతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన ఓటరు జాబితా సవరణలో ఎంతో జాగరూకతతో ఎవరి ఓటు గల్లంతు కాకుండా విధులు నిర్వర్తించాల్సిన అవసరముందని సూచించారు.
ఎవరి ఓటునైనా తొలగించే అందుకు నిబంధనల ప్రకారం అనుసరించాల్సిన ప్రక్రియను తప్పకుండా చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న ఓటరు జాబితా సవరణ ముగిసిన తర్వాత వచ్చే నెల 22వ తేదీన తుది జాబితాను విడుదల చేయనున్నట్లు, ఈనెల 25వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణకు విధించిన గడువును ఫిబ్రవరి నాలుగో తేదీ వరకు పొడిగించే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లు, సంఘం వెలువరించే నిర్ణయాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌ను సాధారణ ఓటర్లకే గాక, వికలాంగులు, వృద్దులకు కూడా అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేయాలని, అందులో తప్పనిసరిగా వౌలిక సదుపాయాలను కల్పించాలని సూచించారు. ఇటీవల నిర్వహించిన శాసనసభ ఎన్నికల్లోనే సుమారు 90 శాతం వౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామని, మిగిలిన వాటిల్లో ప్రాధాన్యత క్రమంలో ఈ పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను వినియోగించాలని, అవసరమైతే కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరించి అదనంగా ఈవీఎంలను సమకూర్చుకోనున్నట్లు తెలిపారు. తుది జాబితాకు సంబంధించిన వివరాలు ప్రజలు తెలుసుకునేందుకు వీలుగా ఈనెల 25న ఓ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్, అదనపు కమిషనర్(ఎన్నికలు) జయరాజ్ కెనడీ పాల్గొన్నారు.