హైదరాబాద్

బల్దియాలో మళ్లీ రాంకీ చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలో మళ్లీ రాంకీ చిచ్చు రగులుకుంది. నగరంలోని పారిశుద్ద్య పనులను ప్రైవేటు సంస్థ అయిన రాంకీ ఎన్విరోకు అప్పగించేందుకు అధికారులు మరోసారి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని 22లక్షల పై చిలుకు ఇళ్లనుంచి నేరుగా చెత్తను సేకరించి, దాన్ని ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌కు, అక్కడి నుంచి శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలించేందుకు వినియోగిస్తున్న సిబ్బంది, యంత్రాలు, వాహానాలన్ని కూడా రాంకీకి అప్పగించేందుకు వీలుగా గతంలో చేసిన ఒప్పందంపై జీహెచ్‌ఎంసీలోని దాదాపు అన్ని కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే! అప్పట్లో ప్రయోగాత్మకంగా ఒక జోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో చెత్త సేకరణ, డంపింగ్ యార్డుకు తరలించే బాధ్యతలను ప్రయోగాత్మకంగా రాంకీకి అప్పగించటంతో కార్మిక, ఉద్యోగ సంఘాలు శాంతించాయి. కానీ నగరం మొత్తం పారిశుద్ద్యం పనుల నిర్వాహణ, ఆజమాయిషీ వంటి బాధ్యతలను రాంకీ ఎన్విరో సంస్థకు అప్పగించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల ఆదేశాలు జారీ చేయటం పట్ల రాంకీ ఒప్పందం పట్ల మరోసారి కార్మిక, ఉద్యోగ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఈ ఒప్పందంతో బల్దియాకు కోట్ల రూపాయల నష్టం వాటిల్లటంతో పాటు రాంకీ పరిధిలో పనిచేసేందుకు పర్మినెంటు కార్మికులతో పాటు ఔట్‌సోర్సు, కాంట్రాక్టు కార్మికుల సైతం ప్రతికూలంగా ఉండటంతో జీహెచ్‌ఎంసీలోని ఉద్యోగ, కార్మిక సంఘాలు మరోసారి ఆందోళనకు సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా బల్దియా గుర్తింపు యూనియన్ అయిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (బీఎంఈయూ) కొద్దిరోజుల క్రితం నోటీసు జరీ చేసింది. ఇపుడు తాజాగా గతంలో గుర్తింపు యూనియన్‌గా కొనసాగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (జీహెచ్‌ఎంఈయు) శనివారం కమిషనర్ దాన కిషోర్‌కు సమ్మె నోటీసునిచ్చాయి. పారిశుద్ధ్యం పనులను రాంకీకి అప్పగించే ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు ఊదరిగోపాల్ నేతృత్వంలో కార్మిక నేతల బృందం కమిషనర్‌ను కోరింది. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, తరలింపు, వాహానాల మరమ్మతుల వంటి బాధ్యతలు నిర్వహిస్తూ జీహెచ్‌ఎంసీపైనే ఆధారపడి ఉన్న పర్మినెంటు ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డన పడే పరిస్థితులున్న విషయాన్ని గుర్తించి, వెంటనే ఈ ఒప్పందాన్ని రద్దు చేసి జీహెచ్‌ఎంసీ కార్పొరేషన్‌ను, ఉద్యోగులను కాపాడాలని, లేనిపక్షంలో తాము నిరవధిక సమ్మెకు దిగుతామని కమిషనర్‌కు స్పష్టం చేసినట్లు యూనియన్ అధ్యక్షుడు ఊదరి గోపాల్ వెల్లడించారు.