హైదరాబాద్

నటుడు సుమన్‌కు సిల్వర్ క్రౌన్ ప్రదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: అందాల నటుడు శోభన్‌బాబు 83వ జయంతి సందర్భంగా ప్రముఖ సినీ నటుడు సుమన్‌కు ‘శోభన్‌బాబు సిల్వర్ క్రౌన్’ ప్రదానోత్సవ కార్యక్రమం తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, నటి కవిత పాల్గొని సుమన్‌కు సిల్వర్ క్రౌన్‌తో పాటు నటి గీతాంజలికి శోభన్‌బాబు పురస్కారం ప్రదానం చేశారు. శోభన్‌బాబు సహజ నటుడని, ఆయన నటనలో జీవించేవాడని పేర్కొన్నారు. కుంటుంబ కథా చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆయన జయంతి వేడుకలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ఆకెళ్ళ రాఘవేంద్ర, కళ పత్రిక సంపాదకుడు డా.మహ్మద్ రఫీ, తెలంగాణ శోభన్‌బాబు సేవా సమితి చైర్మెన్ టీ.రామకృష్ణ, అధ్యక్షుడు ఆర్.పద్మారావు, ప్రధాన కార్యదర్శి లాల్‌బహదూర్ శాస్ర్తీ, నరసింహ, అశోక్ పాల్గొన్నారు. ప్రముఖ గాయనీ ఆమని నిర్వహణలో గాయనీ, గాయకులు అలపించిన సినీ గీతాలు అలరించాయి.
తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి
కాచిగూడ, జనవరి 20: తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన అసవరం ఉందని న్యాయమూర్తి జస్టిస్ నారాయణ అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమి, లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ‘రామాచారి లలిత సంగీతోత్సవం’ ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ నారాయణ మాట్లాడుతూ లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ స్థాపించి విద్యార్థులకు సంగీతంలో శిక్షణ కల్పిస్తూ.. వారిని ప్రొత్సహించడం అభినందనీయమని అన్నారు. గాయకులను అభినందించి సత్కరించారు. ప్రముఖ సాహితీవేత్త డా.తిరుమల శ్రీనివాసాచార్య, డా. ఎంకే రాము, డా.వోలేటి పార్వతీశం, డా.వడ్డేపల్లి కృష్ణ, డా.పద్మ చిత్తరంజన్, కలగా కృష్ణమోహన్, డా.డీ.కామేశ్వర రావు, వారణాసి నాగలక్ష్మీ, చిమ్మపూడి శ్రీరామమూర్తిలకు ఆత్మీయ సత్కారం చేశారు. సంస్థ అధ్యక్షుడు డా.కే.రామాచారి, ప్రధాన కార్యదర్శి డా. ఎన్‌వీఎల్ నాగరాజు పాల్గొన్నారు.
కర్ణాటి లింగయ్యకు ఆత్మీయ సత్కారం
కాచిగూడ, జనవరి 20: ప్రముఖ సాహితీవేత్త డా.కర్ణాటి లింగయ్య వజ్రోత్సవ జన్మదిన వేడుకల సందర్భంగా ఆత్మీయ సత్కార కార్యక్రమం సాధన సాహితీ స్రవంతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా సుబ్బారావు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని కర్ణాటి లింగయ్యను అభినందించి సత్కరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యాశాఖతో పాటు వివిధ పదవులలో పని చేశారని పేర్కొన్నారు. విద్యావేత్తయే కాకుండా అర్థశాస్త్ర నిపుణుడు అని కీర్తించారు. అనేక రచనలు చేసి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని తెలిపారు. కార్యక్రమంలో ఆచార్య టీ.గౌరి శంకర్, సంస్థ అధ్యక్షుడు సాధన నరసింహా చార్య, ఎస్‌ఎస్‌వీఎస్ ప్రసాద్, మహేష్ కుమార్, నాగమణి పాల్గొన్నారు.

ఆకట్టుకున్న సంజన
కూచిపూడి ఆరంగేట్రం
కాచిగూడ, జనవరి 20: ప్రముఖ నృత్య గురువు పద్మశ్రీ శోభానాయుడు శిష్యురాలు, ప్రముఖ నృత్యకారిణి సంజన సిరిపురపు కూచిపూడి ఆరంగేట్ర ప్రదర్శన శ్రీనివాసా కూచిపూడి ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణచారి, సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ పాల్గొని సంజనను అభినందించి సత్కరించారు. సంజన చిన్నతనం నుంచే కూచిపూడిలో రాణించడం అభినందనీయమని అన్నారు. మరిన్ని ప్రదర్శనలు ప్రదర్శించి గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆకాక్షించారు. సంజన ప్రదర్శించిన భామా కలాపం, బాలకృష్ణతో పాటు పలు నృత్యాంశాలు ఆకట్టుకున్నాయి.
అలిశెట్టి ప్రభాకర్ చిరస్మరణీయుడు
కాచిగూడ, జనవరి 20: అగ్నిశిఖ అలిశెట్టి ప్రభాకర్ 67వ జయంతి సందర్భంగా 67 సాహితీవేత్తలచే కవి సమ్మేళనం కార్యక్రమం కళానిలయం సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్ పాల్గొని కవులకు అలిశెట్టి ప్రభాకర్ సాహితీ పురస్కారాలను ప్రదానం చేశారు. అలిశెట్టి ప్రభాకర్ చిరస్మరణీయుడని పేర్కొన్నారు. సాహిత్య రంగానికి చేసిన సేవలను కొనియాడారు. 67 మంది సాహితీవేత్తలకు అలిశెట్టి ప్రభాకర్ సాహితీ పురస్కారాలను ప్రదానం చేసినందుకు జై ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డును ప్రదానం చేశారు. నేటి నిజం సంపాదకుడు బైసాదేవదాసు సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇండియా కోఅర్డినేటర్ బింగి నరేందర్ గౌడ్, ఏభూషి యాదగిరి, సాహితీవేత్త కొమ్మవరపు విల్సన్, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.సురేందర్, పుష్పలత పాల్గొన్నారు.