హైదరాబాద్

ఆది నుంచి అడ్డంకులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది బల్దియా ప్రాజెక్టుల వ్యవహారం. ప్రజాప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణ కోసం ఒక విభాగం చేపట్టే అభివృద్ధి పనులకు మరో శాఖ అడ్డంకులు సృష్టించటం గమనార్హం. ఏ ప్రాజెక్టు పనులు చేపట్టినా బల్దియాలో అంతర్గతంగా ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాల మధ్య సఖ్యత లేకపోవటం, ఇతర విభాగాలతో సరైన సమన్వయం లేకపోవటం ప్రాజెక్టుల పాలిట శాపంగా మారుతోంది. అనేక ప్రాంతాల్లో ఇప్పటికే పలు ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఇదిలా ఉండగా, నగర శివార్లలో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన చెంగిచెర్ల స్లాటర్ హౌజ్‌లోని వ్యర్థాల నియంత్రణ కోసం ప్రత్యేకంగా రూ. 14 కోట్లను ఖర్చు చేసి నిర్మించిన రెండరింగ్ ప్లాంటు పనులకు ఎదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. పదేళ్ల క్రితం ఈ స్లాటర్ హౌజ్, రెండరింగ్ ప్లాంటు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారుచేసినా నాటి నుంచి నేటి వరకు అన్నీ అడ్డంకులే. ఫలితం ఎప్పటికపుడు ఈ ప్రాజెక్టు వ్యయం పెరుగుతూనే ఉంది కానీ ఆశించిన సమయంలో ఏ పని పూర్తి కావటం లేదు. ఇందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ముందుచూపు, సమయస్పూర్తితో వ్యవహరించకపోవటమే ప్రధాన కారణమన్న విమర్శలున్నాయి. రెండరింగ్ ప్లాంటుకు వౌలిక వసతులను కల్పించేందుకు బల్దియా అధికారులు ఎన్నో అడ్డంకులను అధిగమించాల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటికే కరెంటు కనెక్షన్ సమకూర్చినా, ఈ పనులు పూర్తయ్యేందుకు సుమారు ఏడు నెలల సమయం పట్టింది.
వాటర్ కనెక్షన్ ఇచ్చేందుకు జలమండలి సిద్ధంగా ఉన్నా, ప్లాంటు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మెయిన్ పైప్‌లైన్ నుంచి కనెక్షన్ తీసుకోవాల్సి ఉంది. ఈ స్ట్రెచ్ మొత్తం కూడా అటవీశాఖ పరిధిలోకి రావటంతో ఆ శాఖ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. కానీ కనెక్షన్ ఇవ్వాల్సిన జలమండలి విభాగమే ఈ క్లియరెన్స్‌లను సమకూర్చుకోవల్సి ఉండగా, క్లియరెన్స్ తెచ్చుకుంటేనే పనులు చేపడతామంటూ జలమండలి అధికారులు, ఆ అనుమతులు తెచ్చుకునే బాధ్యతను జీహెచ్‌ఎంసీపైకి నెట్టేశారు. వాటర్ కనెక్షన్ కోసం తవ్వకాలు జరపాల్సిన ఈ మూడు కిలోమీటర్లలో పైప్‌లైన్ ఏర్పాటు చేసేందుకు అనుమతి లేకుండానే జలమండలి పనులు చేపట్టగా, రోడ్డు నిర్మించేందుకు తమకు అనుమతివ్వని అటవీశాఖ పైప్‌లైన్ పనులను ఎందుకు అడ్డుకోవటం లేదని హైదరాబాద్ రోడ్డు డవెలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఫిర్యాదు చేయటం వివాదాస్పదమైంది. అప్పటి వరకు ఈ విషయం తెలియని అటవీశాఖ తమ అనుమతుల్లేకుండా తవ్వకాలు జరిపినందుకు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు కూడా నమోదైంది.

4న బల్దియా కౌన్సిల్ ప్రత్యేక సమావేశం

హైదరాబాద్, జనవరి 21: బల్దియా కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ఈ నెల 28న జరగాల్సిన వుండగా వచ్చే నెల 4 తేదీ నిర్వహించేందుకు వాయిదా వేసినట్లు బల్దియా కార్యదర్శి ఆర్. కిషోర్ తెలిపారు. ఈ నెల 31వ తేదీ వరకు నగరంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2019 సర్వే జరగనున్నందున ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలు జారీ చేసినందుకు వాయిదా వేసినట్లు వెల్లడించారు. 4న ఉదయం పదిన్నర గంటలకు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూపకల్పన చేసిన బడ్జెట్ ప్రతిపాదనలపై సమావేశం నిర్వహించనున్నట్లు, అదేరోజు మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రశ్నోత్తరాలు, ఇతర అంశాలపై సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కిషోర్ తెలిపారు.