హైదరాబాద్

నటి జమునకు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రజానటి డా.జమున రమణారావుకు ‘ఎన్‌టీఆర్-ఎఎన్‌ఆర్ - వంశీ’ జీవిత సాఫల్య పురస్కారం ప్రదానోత్సవ కార్యక్రమం వంశీ ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో మంగళవారం చిక్కడపల్లి శ్రీత్యాగరాయ గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య పాల్గొని జమునకు జీవిత సాఫల్య పురస్కారంతో పాటు ‘వెండి కిరీటం’ బహుకరించారు. నేటి తారలకు జమున ఆదర్శప్రాయమని అన్నారు. వంశీ కల్చరల్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కేవీ రమణారావుకు ఎన్‌టీఆర్ సేవా పురస్కారం, రామకృష్ణమఠ్ డిప్యూటీ డైరెక్టర్ ఎఎస్ మూర్తికి ఎఎన్‌ఆర్ సేవా పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు సభాధ్యక్షత వహించగా ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహారావు, గీతాంజలి, రోజారమణ, వంశీ సంస్థల వ్యవస్థాపక అధ్యక్షుడు వంశీ రామరాజు, వంశీ అధ్యక్ష, కార్యదర్శులు డా.తెనే్నటి సుధాదేవి, సుంకరపల్లి శైలజ పాల్గొన్నారు. ప్రముఖ గాయనీ, గాయకులు ఆలపించిన సినీ గీతాలు అలరించాయి.
బాదంతో సంపూర్ణ ఆరోగ్యం
ఖైరతాబాద్, జనవరి 22: పదిహేను రకాల పౌష్టిక విలువలు కలిగిన బాదంతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పౌష్టికాహార నిపుణురాలు షీలా కృష్ణస్వామి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఆల్మండ్ సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని బాదం విశిష్టతను వివరించారు. బాదంలో విటమిన్-ఈతో పాటు మెగ్నీషియం, పీచు పదార్ధం, మాంసకృత్తులు ఉంటాయని తెలిపారు. ఎదిగే చిన్నారుల శారీరక, మానసిక ఆరోగ్యానికి బాదం ఎంతగానో తోడ్పడుతుందని చెప్పారు. వృద్ధులకు నిత్యం ఆహారంలో బాదంను భాగం చేయడంతో ఎముకల పట్టుత్వం పెంపొందుతుందని తెలిపారు. అనంతరం బాదంతో వంటల పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు.
ఆకట్టుకున్న ‘జానపద’ నృత్య ప్రదర్శన
కాచిగూడ, జనవరి 22: ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘జానపద’ నృత్య ప్రదర్శన మంగళవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ నృత్య గురువు నయనతార, గానసభ అధ్యక్షుడు కళా జనార్దన మూర్తి, తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షురాలు వరలక్ష్మీ మంచాల పాల్గొని కళాకారులను అభినందించి సత్కరించారు. శ్రీవాణి నృత్య నికేతన్ అధ్యక్షురాలు శ్రీవాణీ శిష్య బృందం ప్రదర్శించిన జానపద నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.