హైదరాబాద్

24న పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగరంలోని పలు ప్రాంతాలకు ఈనెల 24వ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు జలమండలి అధికారులు తెలిపారు. మండు వేసవిలో సిటీలో నీటి కొరత ఏర్పడినపుడు నగరవాసుల గొంతు తడిపే మంజీరా పైప్‌లైన్‌కు విద్యుత్ సరఫరా చేసే లైన్లలో భాగంగా ఏర్పాటుచేసిన 33 కేవీ మంజీరా ఫీడర్ లైన్‌లో నాలుగు స్తంభాల మార్పిడి కారణంగా అత్యవసరంగా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నందున నీటి సరఫరాకు అంతరాయం కల్గుతోందని జలమండలి అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు పాక్షికంగా అంతరాయమేర్పడే అవకాశముండగా మరికొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. బీహెచ్‌ఈఎల్ ఫ్యాక్టరీ, మ్యాక్స్ సొసైటీ-1, 2, అశోక్‌నగర్, హెచ్‌ఐజీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ, ఎస్‌బీఐటీ, మదీనాగూడ, హెచ్‌ఐజీ, పి.సత్యనారాయణ ఎంక్లేవ్, మియాపూర్, రామచంద్రాపురం ఏరియా, అశోక్‌నగర్ ఏరియా, చందానగర్, అమీర్‌పూర్ ఏరియా, హూడాకాలనీ, పీజేఆర్‌కాలనీ, దీప్తిశ్రీనగర్, శేరీలింగంపల్లి ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఉండబోదని, ఈ విషయాన్ని గమనించిన వినియోగదారులు ముందస్తుగా తాగునీటిని నిల్వ చేసుకుని, జలమండలికి సహకరించాలని అధికారులు కోరారు.