హైదరాబాద్

అదనపు భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నగరంలో సొంతిల్లు లేని పేదల కోసం డబుల్ బెడ్ రూం.. ఎంతో ముందుచూపుతో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం వేలాది కోట్ల రూపాయలను వెచ్చించి ఎస్‌ఆర్‌డీపీ వంటి ప్రతిష్టాత్మకమైన పనులు ఊపందుకున్న నేపథ్యంలో జీహెచ్‌ఎంసీకి ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఆర్థికంగా కష్టకాలం కొనసాగుతున్న సమయంలోనే బల్దియాలో రాంకీ ఒప్పందం మరోసారి తెరపైకి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో రాంకీ ఒప్పందాన్ని అమలుచేస్తే అది బల్దియాకు అదనపు ఆర్థిక భారంగా, గుదిబండగా మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. నగరంలోని పారిశుద్ధ్య పనులను రాంకీ ఎన్విరో సంస్థకు అప్పగిస్తూ ఏడేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని అమలు చేసే దిశగా జీహెచ్‌ఎంసీ అడుగులు వేస్తోంది. కానీ ఉద్యోగ, కార్మికులు రోడ్డున పడతారంటూ కార్మిక, ఉద్యోగ సంఘాలు లబోదిబోమంటున్నా, పాలకమండలి, ఉన్నతాధికారులు మాత్రం రాంకీ ఒప్పందాన్ని పూర్తిస్థాయిలో అమలుచేసే దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ చెత్త రవాణా విభాగంలోని కాంట్రాక్టర్లతో మేయర్ బొంతు రామ్మోహన్ మంగళవారం సమావేశమయ్యారు. ఎలాగైనా రాంకీ ఒప్పందాన్ని పటిష్టంగా అమలు చేయాలని పాలక మండలి, అధికారులు యత్నిస్తుండగా, జీహెచ్‌ఎంసీని పూర్తిగా దివాలా తీసేలా ఈ ఒప్పందముందని, దీన్ని అడ్డుకుని తీరుతామని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు అంటున్నారు. ఇందులో భాగంగానే రాంకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే జీహెచ్‌ఎంఇయు కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇవ్వగా, గుర్తింపు పొందిన భాగ్యనగర్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ (బీఎంఇయూ) కూడా బుధవారం సమ్మె నోటీసు ఇచ్చే అవకాశముంది. కానీ దేశంలోని పలు మహానగరాల్లో ఇలాంటి బాధ్యతలను చేపట్టి విఫలమైన రాంకీ ఎన్విరో సంస్థ జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య పనులను జీహెచ్‌ఎంసీలోని చెత్త రవాణా కాంట్రాక్టర్లకే సబ్ కాంట్రాక్టు ఇవ్వాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతమున్న పారిశుద్ధ్య పద్ధతే మెరుగైందని ఉద్యోగులు, కార్మికులు వాదిస్తున్నారు. నగరంలో ప్రతిరోజు ఉత్పత్తి అయ్యే చెత్తను ఇవ్వటంతోపాటు ప్రస్తుతం చెత్త సేకరణ, ట్రాన్స్‌ఫర్ స్టేషన్, డంపింగ్ యార్డుకు తరలిస్తున్న సుమారు 750 వాహనాలు, అద్దె వాహనాలతో పాటు సిబ్బంది, కార్మికులను రాంకీకి అప్పగించటంతో పాటు ఒక్క టన్ను చెత్తకు జీహెచ్‌ఎంసీ రాంకీకి రూ. 1892 చెల్లించేందుకు వీలుగా చేసిన ఈ అగ్రిమెంటును అమలుచేస్తే జీహెచ్‌ఎంసీ అన్ని రకాలుగా దివాలా తీయటంతో పాటు పారిశుద్ధ్యం, చెత్త రవాణా విధులనే నమ్ముకుని కార్మికులు, ఉద్యోగులు రోడ్డున పడతారని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు వాపోతున్నారు. ఈ ఒప్పందాన్ని పక్కనబెట్టి, చెత్త రవాణాను గతంలో మాదిగా సెంట్రలైజేషన్ చేసి, వాహనాలను మెరుగుపర్చుకుంటే రాంకీ కన్నా మరింత మెరుగ్గా తామే పారిశుద్ధ్యం, చెత్త తరలింపు విధులను నిర్వర్తిస్తామని కార్మికులు, ఉద్యోగులు చెబుతున్నారు.