హైదరాబాద్

ఎన్నికల్లో సమస్యలు పునరావృతం కాకుండా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడతలో జరిగిన సమస్యలు పునరావృతం కాకుండా ఎన్నికల అధికారులు, పోలీస్ శాఖ ఆయా మండలాల పరిధిలో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించాలని వికారాబాద్ కలెక్టర్ సయ్యద్ ఓమర్ జలీల్ అన్నారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్‌లో పోలీస్ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, ఇతర అధికారులతో రెండవ విడత పోలింగ్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ, మొదటి విడతలో కొన్నిచోట్ల కౌంటింగ్ సందర్భంగా కొంత సమస్య వచ్చినట్లు తెలిసిందని, ఇక ముందు జరిగే రెండు, మూడవ విడత పంచాయతీ ఎన్నికలలో ప్రతి మండల స్థాయిలో పోలింగ్ అధికారులకు, పోలీస్ శాఖ సిబ్బందికి తగిన సూచనలు ఇవ్వాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలోని కౌంటింగ్ హాల్‌కు జిల్లా స్థాయి అధికారిని ఎన్నికలు సజావుగా జరిగేందుకు కౌంటింగ్ పరిశీలకులుగా నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారిని ఆదేశించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ సిబ్బంది నిఘా టీమ్‌ను ఏర్పాటు చేసుకోవటం జరిగిందని జిల్లా పోలీస్ సూపరిండెంట్ అన్నపూర్ణ సమావేశంలో తెలిపారు. ఎన్నికల నియమావళి అనుసరించి పోలింగ్ సిబ్బంది పనిచేయాలని కలెక్టర్ సూచించారు. రెండవ విడత జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, కావాల్సిన సిబ్బంది తదితర ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ వివరించారు. పోలీస్ సూపరిండెంట్ అన్నపూర్ణ, అసిస్టెంట్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, వికారాబాద్ డీఎస్పీ శిరీష, తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, జిల్లా పంచాయతీ అధికారి నారాయణ రావు, అడ్మినిస్ట్రేట్ అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.