హైదరాబాద్

అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: గ్రేటర్ హైదరాబాద్‌లో జలమండలి పరంగా ప్రజలకు మేరుగైన సేవలు అందించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి విధులను సక్రమంగా నిర్వహించాలని బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్ హెచ్చరించారు. ఖైర్‌తాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో శనివారం జరిగిన మీట్ యువర్, డయల్ యువర్ ఎండి కార్యక్రమంలో పాల్గొని వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించారు. జలమండలి వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి నెల మూడవ శనివారం బోర్డు ప్రధాన కార్యాలయంలో మీట్ యువర్, డయల్ యువర్ ఎండి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం ఐదుగంటల నుంచి ఆరు గంటల వరకు నిర్వహించిన మీట్ యువర్ ఎండికి 38, ఆరు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి 12 ఫిర్యాదులు అందాయి. వాటిలో నీటి బిల్లింగ్, లోప్రెషర్, అతితక్కువగా నీటి సరఫరా, కలుషిత నీటి సరఫరా వంటి సమస్యలతో కూడిన ఫిర్యాదులు గౌలిపురా, జీడిమెట్ల, యూసుఫ్‌గూడ, మలక్‌పేట్, కొత్తపేట, మోసిన్‌బాగ్, కాప్రా, చందనగర్, లాంగర్‌హౌస్, షేక్‌పేట్, మేహిదిపట్నం నుండి డయల్ యువర్ ఎండి కార్యక్రమానికి అందాయి. జలమండలి డివిజన్-3నుండి అత్యధికంగా ఫిర్యాదులు అందుతున్నాయని ఈ విషయంలో సంబంధిత జనరల్ మేనేజర్ స్వామి వెంటనే తగిన చర్యలు తీసుకుని అవసరమైతే డిజిఎం, మేనేజర్‌లతో కలిసి పర్యటించి వినియోగదారులు ఎదుర్కొంటున్న నీటి సమస్య, డ్రేనేజీ సమస్యను పరిష్కరించి అక్రమంగా ఒకే ఇంట్లో అధనంగా రెండు నీటి కనెక్షన్లు కలిగిన వారి నీటి కనెక్షన్లను తొలిగించి, అవసరమైతే క్రిమినల్ కేసును నమోదు చేయాలని ఎండి అదేశించారు. లాంగర్‌హౌజ్ హరిదాస్‌పురా నుంచి బి.రవి అనే వినియోగదారుడు డయల్ యువర్ ఎండికి ఫిర్యాదు చేశాడు. డోమెస్టిక్ నీటి కనెక్షన్ కలిగిన్నప్పటికి అక్రమంగా మరో రెండు నీటి కనెక్షన్లు తీసుకున్నారు చర్య తీసుకొండి అని ఎన్ని మార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో డయల్ యువర్ ఎండికి ఫిర్యాదు చేశామని వినియోగదారుడు వాపోయాడు. ఈ విషయంలో సంబంధిత సెక్షన్ మేనేజర్, డిజిఎంపై వెంటనే పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదికను అందజేయాలని ఎండి జలమండలి విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. డయల్ యువర్ ఎండి కార్యక్రం అనంతరం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్‌మోహినుద్దీన్ సమావేశమయ్యారు. కార్వాన్‌లో నెలకొన్న డ్రైనేజీ, లోప్రెషర్ నీటి సరఫరా, కలుషిత నీటి సరఫరా వంటి సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఏడిని కోరారు. తమ ప్రాంతంలో నిర్మించిన రిజర్వాయర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ఎండి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో జలిమండలి ఇడి సత్యనారాయణ, డైరెక్టర్లు, సిజిఎం, జిఎం, డిజిఎం, మేనేజర్లు పాల్గొన్నారు.
నీటి ఫిల్లింగ్ స్టేషన్‌ల తనిఖీ
ఇటీవల జలమండలి ఎండిగా పదవీ బాధ్యతలను చేపట్టిన దానకిశోర్ పాల్గొని వినియోగదారులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించారు. ప్రధానంగా వేసవి కాలంలో నీటి ట్యాంకర్లకు డిమాండ్ పెరగటంతో వినియోగదారులకు అశీంచిన రీతిలో నీటిని సరఫరా చేయలేకుపోతున్నామని గుర్తించిన ఎండి నీటి ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్‌లను తనిఖీ చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఉదయం ఉప్పల్, కాప్రాలో ట్యాంకర్ల ఫిల్లింగ్ స్టేషన్‌లను సందర్శించి ట్యాంకర్ల సరఫరా తీరుతెన్నులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జలమండలి డైరెక్టర్లు డాక్టర్ పి.సత్యసూర్యనారాయణ, ఎల్లస్వామి, కొండారెడ్డి, విజిలెన్స్ అధికారి ప్రదీప్‌రెడ్డి, ఎస్‌హెచ్‌ఓ తిరుపతితో పాటు జిఎంలు పాల్గొన్నారు.