హైదరాబాద్

‘ఆత్మీయ సమ్మేళనం’కు అపూర్వ స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదారాబాద్: కింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి అధికారుల వరకు ఉద్యోగరీత్యా బిజీ లైఫ్‌ను గడుపుతున్నారు. పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటలు రౌండ్ ది క్లాక్ పనిచేయాల్సి ఉంటుంది. కానిస్టేబుల్ నుండి మొదలుకుని అధికారి కమిషనర్ వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న వారికి ఉద్యోగ రీత్యా కుటుంబ సభ్యులతో గడపలేక పోతున్నారు. మానసిక ప్రశాంతతకు దూరమైన పోలీస్ సిబ్బంది, అధికారులకు ఒకింత పని ఒత్తిడి నుంచి దూరమవడానికి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ‘అత్మీయ సమ్మేళనం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో తమ తల్లిదండ్రులు పనిచేస్తున్న పోలీసుస్టేషన్లు, కార్యాలయాలను సందర్శించే భాగ్యం వారి పిల్లలకు కలుగుతుంది. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి విశేష స్పందన లభించడంతో పాటు ఆదరణ లభించింది. ప్రతి పోలీసుస్టేషన్‌లో సిబ్బంది అధికారుల కుటుంబ సభ్యులతో కలిసి వారు పనిచేసిన తీరుతెన్నులను వారి పిల్లలకు కళ్లకు కట్టినట్లు వివరించడం వంటి కార్యక్రమాలు ఈ సమ్మేళనంలో పలువురిని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది, అధికారుల పిల్లలకు వారి కుంటుంబ సభ్యుల సమక్షంలో వివిధ రకాల పోటీలు నిర్వహించి గెలుపొందిన చిన్నారులకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశ్యం. ఇందులో భాగంగా ఆదివారం నగర నేర పరిశోధన, క్రైమ్, మహిళా పోలీసుస్టేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని సీసీఎస్ కార్యాలయ ప్రాంగణంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. నగర పోలీస్ అదనపు కమిషనర్ (క్రైమ్, సిట్, షీటీమ్స్) షికాగోయల్, డీసీపీ అవినాష్ మహంతిల పర్యవేక్షణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఉద్యోగులు కుంటుంబ సభ్యులు, వారి పిల్లలు పాల్గొని సందడి చేశారు. ఆటా, పాటలతో ఈ ప్రాంగణం కోలాహలంగా మారింది. పోలీసు డ్యూటీలో బిజీగా ఉండే మా తల్లిదండ్రులు వారానికి ఒకరోజైన తమతో గడిపేలా పోలీస్ ఉన్నతాధికారులు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని చిన్నారులు నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో చిన్నారులకు ఆటా, పాటలతో పాటు వివిధ అంశాల్లో పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన కమిషనర్ అంజనీ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులతో అధిక సమయం కేటాయించి వారితో ముచ్చటించి చిన్నారుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ దేశంలో అతి పెద్ద పోలీస్ వ్యవస్థ కలిగింది హైదరాబాద్ అని చెప్పారు.
కానిస్టేబుల్ స్థాయి నుంచి అధికారి స్థాయి వరకు ప్రతి ఒక్కరు రౌండ్ ది క్లాక్ 24 గంటలు పనిచేయడంతో నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయన్నారు. పోలీసులు చక్కగా పనిచేయాలంటే వారికి ప్రధానంగా కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం అవసరమని ఆయన గుర్తుచేశారు. నగరంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయంటే ఇది మన అందరి విజయమని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అవసరమైనంత మేరకు నేరాలు అరికట్టకలుగుతున్నామని వెల్లడించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించే అధికారులు, సిబ్బందికి ప్రభుత్వ పరంగా, పోలీస్ శాఖ వాహనాలను సమకూర్చిందన్నారు. పోలీస్ సిబ్బంది, అధికారుల కుటుంబ సభ్యులతో పాటు వారిపిల్లలను కలిసే భాగ్యం తనకు దక్కినందుకు ఎంతో సంతోషంగా ఉందని, పోలీస్ సిబ్బంది, అధికారులు వారి కుటుంబ సభ్యుల బాగోగులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన నగర పోలీస్ అదనపు కమిషనర్ (క్రైమ్, సిట్, షీటీమ్స్) షికాగోయల్ మాట్లాడుతూ.. పోలీస్ ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి, అధికారి వారి పిల్లలను ఉన్నత విద్యలు చదివించి వారిని గొప్ప ప్రయోజకులుగా తీర్చి దిద్దాలని సూచించారు. కార్యక్రమానికి స్వాగతోపన్యాసం చేసిన డీసీపీ మహంతి మాట్లాడుతూ.. వసంతపంచమి రోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం సంతోషకరమైన విషయమన్నారు. కుటుంబసభ్యుల ప్రోత్సాహం లేకుంటే ఎవ్వరు కూడా ఉద్యోగం చేయలేరని, పోలీస్ ఉద్యోగి, అధికారుల పట్ల అండగా ఉంటున్న వారి కుటుంబ సభ్యులను మహంతి అభినందించారు. అంతకు ముందు చిన్నారులకు నిర్వహించిన టాయ్, క్రీడా పోటీలను సీపీ అంజనీ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీలు ఎంఏ బారి, రఘువీర్, ఏసీపీ శ్రీదేశి, ఇన్‌స్పెక్టర్ మంజుల పాల్గొన్నారు.