హైదరాబాద్

లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు సమన్వయ కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికలు ఎలాంటి లోటుపాట్లు లేకుండా నగరంలో ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు వీలుగా ప్రత్యేక సమన్వయ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. నగరంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి అసిస్టెంటు రిటర్నింగ్ అధికారి స్థాయి నుంచి కూడా అన్ని క్యాటగిరీల అధికారులతో సమన్వయాన్ని పెంపొందించేందుకు ఈ కమిటీలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై దాన కిషోర్ మంగళవారం ప్రధాన కార్యాలయంలో పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, జీహెచ్‌ఎంసీ పరిధిలోకి మూడు పార్లమెంటు నియోజకవర్గాలు వస్తాయని, ఇందులో సికిందరాబాద్‌లో ఏడు, హైదరాబాద్‌లో ఏడు, మల్కాజ్‌గిరి పరిధిలోకి కంటోనె్మంట్ అసెంబ్లీ స్థానాలున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా పోలీసు ఉన్నతాధికారులు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంటు రిటర్నింగ్ అధికారులతో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రధానంగా నగరంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లు, ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఓ నోడల్ అధికారిని నియమిస్తున్నట్లు తెలిపారు. రెండురోజుల క్రితం విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో ప్రారంభించిన మొదటి దశ ఈవీఎంల తనిఖీ కొనసాగుతుందని, ఈ ప్రక్రియ ఈ నెల 25వ తేదీన పూర్తి చేస్తామని వివరించారు. ఇటీవల చేపట్టిన ఓటరు జాబితా సవరణ ప్రక్రియ కూడా పూర్తయిందని, తుది జాబితాను ఈ నెల 22వ తేదీన ప్రకటించనున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా వివిధ విభాగాల అధికారులు, సిబ్బందితో కలిపి ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నగరంలోని హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ స్థానాలకు రిటర్నింగ్ అధికారులను నియమించనున్నట్లు హైదరాబాద్ స్థానానికి హైదరాబాద్ కలెక్టర్, సికిందరాబాద్‌కు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను రిటర్నింగ్ అధికారిగా నియమించనున్నట్లు తెలిపారు. ఎన్నికలకు అవసరమైన సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే వివిధ విభాగాలకు లేఖలు రాశామని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల విధులకు హాజరుకాని సిబ్బంది, అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేసినట్లు కమిషనర్ దాన కిషోర్ వెల్లడించారు. హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించి అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ పోలీసు స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమించనున్నట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ వెల్లడించారు.