హైదరాబాద్

వీర జవాన్లకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్ : భారతమాత రక్షణకు అసువులు బాసిన వీర జవాన్లకు ప్రెస్‌క్లబ్ రిపోర్టర్లు ఘనంగా నివాళి అర్పించారు. కాశ్మీర్‌లోని పుల్వామ వద్ద ముష్కరుల దాడిలో వీర మరణం పొందిన జావాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవ్వత్తుల ర్యాలీ నిర్వహించారు. సుమారు 50 మంది వివిధ మీడియా సంస్థలకు చెందిన రిపోర్లు అమరవీరులకు జోహార్లు, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ ప్రధాన రహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మల్లేష్, కిరణ్ కుమార్, అరుణ్, కుల్లా రవీందర్, సతీష్, రాజేష్, ప్రసాద్, విశే్వశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
వికారాబాద్: కాశ్మీర్‌లో సీఆర్‌పీఎఫ్ జనాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఉగ్రవాదుల దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి తాడెం అనిల్ మాట్లాడుతూ, ఉగ్రవాదులు సైనికులపై చేసిన దాడి పిరికిపంద చర్య అన్నారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులకు త్వరలోనే బుద్ధి చెబుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర సంయుక్త కార్యదర్శి నవీన్, సాకేత్, ఆకాశ్, ప్రకాష్, వంశీ, శేఖర్, సురేశ్, కృష్ణారెడ్డి, హరీష్, గణేష్, సరేశ్ నాయక్, అబ్దుల్, సందీప్, అఫ్రోజ్ పాల్గొన్నారు.
తలకొండపల్లి: మండలంలోని చుక్కాపూర్ గ్రామంలోని సర్పంచ్ దాసరి కిష్టమ్మ, మాజీ ఎంపీటీసీ యాదయ్య ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన వీరజవాన్‌ల ఆత్మకు శాంతి కలగాలని కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని అంబెద్కర్ చౌరస్తావద్ద దిష్టిబొమ్మ దగ్ధం చేసి పెద్ద ఎత్తున వీర జవాన్‌లకు ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడ్వకేట్ పాండు, మహేష్, కే.మధు, శివ, రాకేష్, నరేష్, శ్రీను, పాష, తిరుపతి రెడ్డి, మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.