హైదరాబాద్

ఆకట్టుకున్న సంగీత గాత్ర కచేరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: ప్రవీణ్య ఆర్ట్ ఆకాడమీ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత కళాకారిణి శే్వత ప్రసాద్ శిష్య బృందంచే ‘వాగ్గేయక’ పేరిట సంగీత కచేరి శనివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. కార్యక్రమానికి ప్రముఖ సంగీత గురువు గీతా చంద్రన్ పాల్గొని జ్యోతి ప్రజ్వాలనా చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శే్వత ప్రసాద్ అలపించిన వాగ్గేయకర సంగీతం అలరించాయి. కార్యక్రమంలో ప్రముఖులు డా. ఆనంద శేఖర్ జయంత్, డా.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నైతిక విలువలతో కూడిన విద్య అవసరం
కాచిగూడ, ఫిబ్రవరి 16: విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యనందించాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. మదర్ థెరిస్సా హైస్కూల్ 31వ వార్షికోత్సవ వేడుకలు బాగ్‌లింగంపల్లి వీఎస్‌టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ముఠాగోపాల్ మాట్లాడుతూ మదర్ థెరిస్సా స్కూల్ స్థాపించి 31వ సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కొన్ని ప్రైవేట్ స్కూల్ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా నడిపిస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. పిల్లలను విద్యతో పాటు సంస్కృతిక రంగల్లో ప్రొత్సహిస్తున్న మదర్ థెరిస్సా స్కూల్‌ను అభినందించారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డిప్యూటీ ఎడ్యుకేషనల్ అఫీసర్ సమ్యూల్ రాజ్, కార్పొరేటర్ ఎడ్ల భాగ్యలక్ష్మీ యాదవ్, స్కూల్ చైర్మెన్ కస్తూరి, కరస్పాండెంట్ కేవై రావు, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ బస్వేశ్వర రావు, వాసు, హైమవతి పాల్గొన్నారు.
తెలంగాణ కెప్టెన్‌గా ఎన్‌వైకే రెడ్డి
* అఖిల భారత ఎలక్ట్రిసిటీ వాలీబాల్ టోర్నీ
హైదరాబాద్, ఫిబ్రవరి 16: మహారాష్ట్ర ష్ట్రా స్టేట్ పవర్ జెనరేషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 20 నుంచి 22 వరకు నాసిక్‌లో 43వ అఖిల భారత ఎలక్ట్రిసిటీ కంట్రోల్ బోర్డు వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తారు. ఈ టోర్నమెంట్‌లో పాల్గొనే తెలంగాణ జట్టును తెలంగాణ స్టేట్ ట్రాన్స్ కో స్పోర్ట్స్ అఫీసర్ జగన్నాథ్ శనివారం ప్రకటించారు. తెలంగాణ ట్రాన్స్‌కో వాలీబాల్ జట్టుకు కెప్టెన్‌గా దిల్‌సుఖ్‌నగర్ సీడీపీసీఎల్‌లో ఏఈగా పనిచేస్తున్న ఎన్,ఏడుకోండల్ రెడ్డి నాయకత్వం వహిస్తారు. జట్టుకు మేనేజర్‌గా జీ.వెంకటేశ్, కోచ్‌గా బీ.శ్రీకాంత్ వ్యవహరిస్తారు. ఎంపికైన తెలంగాణ జట్టు ఈనెల 18న నాసిక్‌కు బయలుదేరి వెలుతుంది. జట్టుకు ఎంపికైన వారిలో ఏడుకోండల్‌రెడ్డితో పాటు వీ.రాజు, ఎం.మల్లేశం, సీహెచ్.శ్రీనివాస్ రెడ్డి, సీ.కిరణ్ ప్రకాష్, వై.రాజేష్, జీ.వెంకటేశ్వర్లు, ఎస్.కమలాకర్, బీ.రవి కుమార్, ఎ.చాందర్‌లాల్, ఎ.బాలస్వామి, కే.రాంకుమార్ ఉన్నారు.