హైదరాబాద్

అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాశ్మీర్ పుల్వామా ప్రాంతంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిని నిరసిస్తూ నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం ఇందిరాపార్కు వద్ద క్యాండిల్ ప్రదర్శన జరిగింది. నగర టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా యువకలు, మహిళలు క్యాండిల్ ప్రదర్శన నిర్వహించి, అమర వీరులకు నివాళి అర్పించారు. ర్యాలీలో భాగంగా పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. దేశంలో అశాంతిని రేపి, విచ్ఛిన్నం చేసేందుకు యత్నిస్తున్న ఉగ్రవాద మూకలను తరిమికొట్టాలని, ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమరులైన జవాన్ల కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఈ ఘటనతో దేశ ప్రజలంతా ఎంతో బాధపడుతున్నారని, ముక్తకంఠంతో ఖండించాలని సూచించారు. ఉగ్రవాద చర్యలను రాజకీయాలకతీతంగా వ్యతిరేకించాలని సూచించారు. దేశ రక్షణలో విధులు నిర్వర్తిస్తూ ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల త్యాగం ఏ నాటికి జాతి మరువదని, వారికెంతో రుణపడి ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు కూన వెంకటేశ్ గౌడ్, నేతలు ఆర్.వివేక్, ఏ.సుదేశ్, పీ.సత్యనారాయణ, ఎస్.శరణ్ కుమార్, సయ్యద్ అస్లాం, జే.శ్రీనివాస్, టీ.రవీందర్, కే.కిరణ్, షేక్ పాషా, గురుదీప్ సింగ్, ముప్పిడి నర్సింగ్ రావు, రజనీకాంత్, పీ.విజయ్, కుమారస్వామి, ఎం.రాజు, ఇ.సాయి, ఇలామ్ హుస్సేన్, మహేశ్, మహిళా నాయకురాలు ఝాన్సీ, ప్రమీల, అన్నపూర్ణ, శాంతి పాల్గొన్నారు.