హైదరాబాద్

‘ఎస్‌ఎల్‌పీ 5కే రన్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/గచ్చిబౌలి: మేధో వికలాంగులైన పిల్లలు ఉన్న తల్లిదండ్రులను/కుటుంబాల సాధికారికతకు దేశంలోని అతి పెద్ద స్టార్టప్ మారథాన్ - ‘ఎస్‌ఎల్‌పీ 5కే రన్’ను నిర్వహించింది. మారథానర్, గ్రాన్యూల్స్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమా దేవి చిగురుపాటి ఆదివారం జెండా ఊపి రన్‌ను ప్రారంభించారు. స్టార్టప్ రంగంలో అత్యుత్తమ వ్యవస్థాపకులు, ముఖ్యులు, నూతన ఆవిష్కర్తలకు గ్లోబల్ నెట్‌వర్క్ - స్టార్టప్ లీడర్‌షిప్ ప్రొగ్రామ్ (ఎస్‌ఎల్‌పి) అధ్వర్యంలో ‘నయూ దిశ’ స్వచ్చంద సంస్థ, దేశంలోని బధిర ఆటగాళ్లు (డెఫిలింపిక్స్ ప్లేయర్స్)కు అన్ని విధాలా మద్దతు అందిస్తున్న ప్రాజెక్ట్ అమారిస్ ఫర్ డీప్ ట్రస్టు అనే మరో స్వచ్చంద సంస్థల సంయుక్త సహకారంతో గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ ఎస్‌ఎల్‌పీ 5కే రన్‌ను పెద్ద ఎత్తున నిర్వహించింది.
ఎగుమతుల్లో 130 శాతం
వృద్ధిని సాధించిన సోనాలిక
నాలుగు దేశాల్లో నెంబర్ వన్ ట్రాక్టర్ బ్రాండ్ అయిన మన దేశానికి చెందిన సోనాలిక ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ ఈ ఏడాది జనవరిలో 1694 ట్రాక్టర్లను ఎగుమతి చేసి 130 శాతంతో అసాధారణ వృద్ధిని నమోదు చేసిందని సోనాలిక గ్రూపు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రమణ్ మిట్ల్ తెలిపారు. నాలుగు దేశాల్లో నెంబర్ వన్ బ్రాండ్‌గా ఉండడంతో పాటు వందకు పైగా దేశాల్లో ప్రముఖంగా ఉన్న తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకున్నామని ఆయన చెప్పారు. కంపెనీ తన అభివృద్ధి పథాన్ని కొనసాగిస్తూ గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు క్యుమ్‌లేటివ్ బేసిస్ ఆధారంగా 95,001 ట్రాక్టర్లను విక్రయించినట్లు వివరించారు.