హైదరాబాద్

పండిట్, పీఈటీకి పదోన్నతిపై ఆర్‌యూపీపీ హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్న భాషా పండితులతో పాటు పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్‌లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేయడం పట్ల రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ (ఆర్‌యూపీపీ) రాష్ట్ర అదనపు కార్యదర్శి డాక్టర్ ఎస్.విజయ భాస్కర్ హర్షం వ్యక్తం చేశారు. 25 సంవత్సరాల నుంచి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ప్రాథమిక పాఠశాల జీతాలు తీసుకుంటూ శ్రమ దోపిడికి గురైన పండితులకు సరైనా న్యాయం జరిగిందని తన ప్రకటనలో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట కట్టుబడి జన్మదినం సందర్భంగా జీవో జారీ చేయడం ఎంతో అభినందించినదగ్గ విషయంగా భాస్కర్ కొనియాడారు. గతంలో అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసిన సందర్భంగా అప్పటి ముఖ్యమంత్రులు, విద్యాశాఖ మంత్రులు హామీ ఇచ్చారని, అమలు చేయలేక పోయారని తెలుగు భాషా అభిమాని సీఏం పండితులకు తగిన న్యాయం చేశాడని భాస్కర్ వెల్లడించారు. అప్‌గ్రేడేషన్ చేయడానికి సహకరించిన టీచర్ ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, పూల రవీంధర్, పాతూరి సుధాకర్ రెడ్డితో పాటు వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులకు డా.ఎస్.విజయ్ భాస్కర్ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి మండల, జోనల్, జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో రాణించేందుకు విశేషంగా కృషి చేస్తున్న పీఈటీలకు కూడా సీఎం సముచి స్థానం కల్పించారని భాస్కర్ పేర్కొన్నారు. పండితులకు, పీఈటీలకు ఆప్‌గ్రేడ్ చేయడంలో అన్ని ఉపాధ్యాయ సంఘాలు సమష్టిగా పనిచేశాయని ట్రైబల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కత్తి వెంకట స్వామి తెలిపారు.

విశ్వకర్మల సమస్యలు పరిష్కరించాలి
ఖైరతాబాద్, ఫిబ్రవరి 17: తెలంగాణ రాష్ట్రంలో విశ్వకర్మ కులస్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని విశ్వకర్మ ఎంప్లాయాస్ అసోసియేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సర్వసభ్య సమావేశం, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి రాష్ట్ర విశ్వకర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వేములవాడ మదన్ మోహన్ ముఖ్య అతిధిగా హాజరై క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలు- స్థితిగతులపై చర్చించారు. వడ్రంగి వృత్తిలో కొనసాగుతున్న వారిపై ప్రభుత్వ అధికారుల వేదింపులు సరికాదని అన్నారు. చేతివృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వ నిబందనలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని చెప్పారు. అడవిని సంరక్షించే పేరుతో చేతివృత్తిదారులకు ఉపాధిని దూరం చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. విశ్వకర్మల భవన నిర్మాణానికి ప్రభుత్వం చేయూత నివ్వడం హర్షణీయమని పేర్కొన్నారు. తెలంగాణ కోసం అసువులు బాసిన శ్రీకాంత చారి వర్దంతిని అమర వీరుల దినంగా, ఆచార్య జయశంకర్ జయంతిని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని కోరారు. విశ్వకర్మలకు వెయ్యి కోట్లతో కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగాచారి, సాయిలు, సుమన్, జనార్థన్ పాల్గొన్నారు.