హైదరాబాద్

సందేశ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: స్వచ్ఛ్భారత్ ఆవశ్యకతను దేశ ప్రజలకు వివరించే ఉన్నత లక్ష్యంతో 50ఏళ్ల మహిళ సంగీత నడుం బిగించింది. గత ఏడాది ఆగస్టు 12న ముంబయ నుంచి ప్రారంభమైన యాత్ర సోమవారం హైదరాబాద్ నగరానికి చేరుకుంది. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వేదాలకు పుట్టినిల్లుగా విరాజిల్లుతున్న మన దేశాన్ని మొత్తం చుట్టిరావాలన్న ఆకాంక్ష తనకు ఎప్పటి నుంచో ఉండేదని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించడంతో పాటు అక్కడి పరిస్థితులను తెలుసుకునేందుకు యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. తన యాత్రకు టాటా సంస్థ ప్రత్యేక సౌకర్యాలతో కూడిన వాహనాన్ని సమకూర్చిందని వివరించారు. 175 రోజులుగా దేశంలోని వివిధ పట్టణాలు, గ్రామాలు ప్రయాణించినట్టు తెలిపారు. కశ్మీర్‌లోని పుల్వామాలో సైతం తాను ఒంటరిగా ప్రయాణించానని అక్కడి ప్రజలు టూరిస్టుగా తనను ఎంతగానో ఆదరించారని చెప్పారు. రోజులో సుమారు 17 గంటలు కారులో ప్రయాణం చేస్తూ రాత్రుల్లో పట్టణాల్లో నిద్రిస్తూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని పేర్కొన్నారు. ఎంతో ఘన చరిత్ర ఉన్న హైదరాబాద్ నగరానికి చేరుకోవడం ఆనందంగా ఉందని సంగీత తెలిపారు. 175 రోజుల దేశ యాత్రలో తనకు ఎక్కడా ఇబ్బందులకు గురికాలేదని, పబ్లిక్ టాయిలెట్లను వినియోగించుకుంటూ ఆయా గ్రామాల్లో, పట్టణాల్లో మురగుదొడ్ల పరిస్థితులను తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నానని చెప్పారు. 29 రాష్ట్రాలు, ఐదు కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టిరావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే 39500 కిలోమీటర్లను పూర్తి చేశానని తెలిపారు. త్వరలోనే తన లక్ష్యాన్ని పూర్తి చేసుకొని భారతదేశం సేఫ్ అండ్ క్లీన్ కంట్రీ అని ప్రపంచ దేశాలకు చాటుతానని తెలిపారు.

తెలంగాణ వైభవాన్ని కాపాడుకోవాలి
కాచిగూడ, ఫిబ్రవరి 18: తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని కాపాడుకోవాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు డా.వకుళాభరణం కృష్ణమోహన రావు అన్నారు. తెలంగాణ స్ఫూర్తి ప్రదాత, ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా ఉజ్వల సాంస్కృతిక, సామాజిక సంస్థ, సుస్వర సుగుణ కళాభారతి, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో ‘తెలంగాణ ఎక్సలెన్సీ’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం గానసభలోని కళా వేంకట దీక్షితులు కళావేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వకుళాభరణం కృష్ణమోహన రావు మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాడిన తరువాత కళలను ఎంతో ప్రొత్సహిస్తుందని పేర్కొన్నారు. నృత్య గురువులు మోహన్, భావనకు అవార్డులను ప్రదానం చేశారు. కళాకారులు ప్రదర్శించిన పలు నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఏబూషి యాదగిరి సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ, సంస్థ కల్చరల్ కోఅర్డినేటర్ రాధిక, ప్రముఖ గాయనీ సాయి పావని, రవిమన్యు పాల్గొన్నారు.