హైదరాబాద్

ఎల్‌బీ స్టేడియాన్ని సందర్శించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : లాల్‌బహుదూర్ స్టేడియాన్ని క్రీడలు, యువజన, అబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. స్టేడియంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, శిక్షణ శిబిరాలు వంటి అనేక విషయాలను సంబంధించి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) వైస్‌చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఏ.దినకర్ బాబు వివరించారు. మంత్రి పర్యటనలో భాగంగా స్టేడియంలో క్రీడాకారుల ప్రాక్టీసును తిలకించారు. ఇండోర్ స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ప్రముఖ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి నైనా జైస్వాల్‌తో మంత్రి టేబుల్ టెన్నిస్ ఆడి క్రీడాకారులను ప్రోత్సహించారు. లాల్‌బహదూర్ స్టేడియంలోని వాలీబాల్, టెన్నిస్ వంటి ఇతర సెంటర్లకు వెళ్లి క్రీడా వౌలిక సదుపాయాలను పరిశీలించారు. రాష్ట్ర క్రీడా శాఖ కార్యదర్శి బుర్ర వెంకటేశం, సాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ దినకర్‌బాబుతో సాట్స్ కార్యాలయంలో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు కోచ్‌లకు తగిన ప్రాధాన్యతను ఇస్తామని మంత్రి తెలిపారు. గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని చెప్పారు. ప్రముఖ క్రీడాకారులు సానియా మీర్జా, గోపిచంద్, సైనా నెహ్వాల్ ఇదే మైదానంలో ఆడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని పేర్కొన్నారు.