హైదరాబాద్

యుద్ధయోధులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, : చైనాతో జరిగిన యుద్ధం అనంతరం దేశం కోసం సైన్యంలో పనిచేసిన యుద్ధయోధులకు ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలని వాయిస్ ఆఫ్ వార్ వెటరన్స్ డిమాండ్ చేసింది. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వార్ వెటరన్ కెప్టెన్ పాండురంగా రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలో భారత సైనికులు ఎంతో మృతిచెందగా భారత ప్రభుత్వ పిలుపు మేరకు ఎంతో మంది యువకులు సైన్యంలో చేరారని అన్నారు. అనంతరం 1965, 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో పాల్గొన్నవారిని యుద్ధయోధులుగా ప్రభుత్వం సైతం గుర్తించిందని చెప్పారు. ఆ సమయంలో కొంత మంది మృతిచెంది మరికొంత క్షతగాత్రులుగా మిలిగిపోగా, కొద్ది మంది మాత్రమే జీవించి ఉన్నారని పేర్కొన్నారు. ఇలా జీవించి ఉన్నవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది పాటి సహాయం కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వయస్సు మీద పడి వృదాప్యంలో వివిధ ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుందని, ఆదుకోవాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని తెలిపారు. దేశ రక్షణకు పనిచేసిన సైనికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాజకీయవేత్తలు తమ వేతనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారని అన్నారు. కేవలం ఐదేళ్లు మాత్రమే కొనసాగే ఎమ్మెల్యే, ఎంపీల కోసం భారీగా నిధులు కేటాయిస్తూ, రెండు సార్లు జరిగిన పాక్ యుద్ధంలో పాల్గొన్న యోధులను విస్మరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ప్రకారం ఆ సమయంలో సైన్యంలో చేరి ప్రస్తుం జీవించి ఉన్నవారు కేవలం 610 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. వీరికి మానవతా దృక్పథంతో ఆరోగ్య పధకాన్ని అమలు చేయాలని కోరారు. కేంద్రం పట్టించుకోని పక్షంలో కనీసం రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి న్యాయం చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాల్సి ఉందని కోరారు. పుల్వామా దాడి అనంతరం అమరులైన వీర జవాన్లకు నివాళి అర్పిస్తున్న అన్ని వర్గాల ప్రజలు కూడా స్పందించి న్యాయమైన సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో న్యాయవాది మహేందర్ రెడ్డి, కొల్లూరి చిరంజీవి పాల్గొన్నారు.