హైదరాబాద్

భవన నిర్మాణంలో నిబంధనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : మహానగరంలో సొంతింటిని నిర్మించుకోవాలనుకునే వారు భవన నిర్మాణానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ నియమ నిబంధనలను అనుసరించి, అనుమతులను తీసుకుని, వాటిని ఏ మాత్రం ఉల్లంఘించకుండా నిర్మించుకుని, ఆనందంగా జీవించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్ సూచించారు. భవన నిర్మాణ అనుమతులపై దరఖాస్తుదారులకు అవగాహన పెంపొందించేందుకు జీహెచ్‌ఎంసీ మొట్టమొదటి సారిగా శనివారం ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ‘ఇల్లు-నిర్మాణ సందేహాలు’ అవగాహన సదస్సులో కమిషనర్, చీఫ్ సిటీ ప్లానర్ ఎస్.దేవేందర్‌రెడ్డి అనుమతి తీసుకునే తీరుపై ప్రజెంటేషన్ ఇచ్చి,వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉందని, వీటిని ఉపేక్షించేది లేదంటూ పలు సార్లు స్పష్టం చేసినట్లు తెలిపారు. అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ఇప్పటి వరకు అమలు చేసిన స్కీంలు మున్ముందు అమలయ్యే అవకాశం లేదని, ఇప్పటి వరకు గుర్తించిన అన్ని అక్రమ నిర్మాణాలను మున్ముందు తప్పకుండా కూల్చేస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గుర్తించి దరఖాస్తుదారులు నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని, ఎలాంటి డీవియేన్స్ లేకుండా నిర్మించుకోవాలని సూచించారు. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఇల్లు, ఫ్లాట్‌కొనుగోలు చేసే అంశంపై నగరంలో చాలా మంది దళారులు, మధ్యవర్తులపైనే ఆధారపడి ఉన్నారని, ఇందులో వారు మోసపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని వివరించారు. అంతేగాక, నిబంధనల గురించి తెలియన నిర్మాణదారుకు అక్రమంగా నిర్మించుకుని, రిస్కులో పడుతున్నారన్న విషయాన్ని గుర్తించి, వారికి అవగాహన కల్పించేందుకే దేశంలో మొట్టమొదటి సారిగా జీహెచ్‌ఎంసీ ఈ అవగాహన సదస్సును నిర్వహించిందని తెలిపారు. ఇందులో 550 చదరపు గజాల స్థలంలో ఇళ్లు నిర్మించుకోవాలనుకునే వారికి కోసం తామే ప్లాన్‌లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇకపై అనుమతులు జారీ చేసిన తర్వాత, అనుమతులు, ఆమోదించిన ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయా?లేదా? అన్న విషయాలను ధృవీకరించేందుకు ప్రతి నిర్మాణాన్ని మూడుసార్లు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, నిర్మాణం జరుగుతున్న తీరుకు సంబంధించిన ఫొటోలను ఆన్‌లైన్‌లో పెట్టనున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్ ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించిన ఈ సదస్సుకు సిటీ చీఫ్ ప్లానింగ్ అధికారి ఎస్. దేవేందర్‌రెడ్డి, టౌన్, కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ విధ్యాధర్, ఆస్కీ అధికారి సుబ్రహ్మణ్య తదితరులతో పాటు సుమారు 500 మంది దరఖాస్తుదారులు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.
ప్రతి జోన్‌లో నెలకోసారి ‘సదస్సు’
భవన నిర్మాణ అనుమతులు తీసుకునే తీరుపై ప్రజల్లోఅవగాహనను పెంపొందించేందుకు ఇకపై ప్రతి జోన్‌లో నెలకోసారి ఇలాంటి అవగాహన సదస్సులు నిర్వహించాలని కమిషనర్ దాన కిషోర్ సంబంధిత టౌన్‌ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. నిబంధనలు తెలీక, సకాలంలో అనుమతులు రాక ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నందున ఈ రకమైన సదస్సులు మరిన్ని నిర్వహించాల్సిన అవసరముందని సూచించారు. తీసుకున్న అనుమతిని ఉల్లంఘించి ఒక్క అంతస్తు అదనంగా నిర్మించినా, యజమానిపై చర్యలు తీసుకోవటంతో పాటు అదనంగా కూల్చిన అంతస్తును కూల్చేసేలా చట్ట సవరణ జరిగిందని విషయం కూడా ప్రజలకు తెలియజేయాలని అన్నారు.
21రోజుల్లో అనుమతి ఇస్తాం ‘స్టేటస్’ చూసుకునేందుకు ప్రత్యేక మొబైల్ యాప్
భవన నిర్మాణం కోసం కావల్సిన అన్ని రకాల డాక్యుమెంట్లతో జీహెచ్‌ఎంసీ డీపీఎంఎస్ విధానంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత ఏడు రోజుల్లో దరఖాస్తులోని లోటుపాట్లపై దరఖాస్తుదారుడికి ఎస్‌ఎంఎస్ వస్తుందని, 21 రోజుల్లో అనుమతులను మంజూరు చేస్తామని కమిషనర్ తెలిపారు. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు ప్రతి జోనల్ ఆఫీసులో డ్యాష్‌బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు.