హైదరాబాద్

‘పన్ను’సమస్యలకు పరిష్కారం నేటి నుంచి సర్కిళ్లలో కార్యక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, : ప్రతి ఆర్థిక సంవత్సరం వేల కోట్లలో బడ్జెట్‌ను రూపొందించే బల్దియాకు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను ఇక ముమ్మరం చేయనున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు కేవలం మరో 35రోజులు మాత్రమే ఉండటంతో లక్ష్యానికి తగిన విధంగా పన్నును వసూలు చేసుకునే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఏటా రూ. 1500 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు కేవలం వెయ్యి కోట్లు మాత్రమే వసూలు చేయటం, ప్రతి ఏటా రూ. వంద కోట్ల నుంచి 150 కోట్ల వరకు అదనంగా వసూలు చేస్తూ వస్తున్నారు. కానీ ఈ సారి పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తుండటంతో పన్ను చెల్లించేందుకు బకాయిదారులు సిద్దంగా ఉన్నా, పన్ను రికార్డుల్లో లోపాలు, సమస్యల కారణంగా వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, వెంటనే పన్ను చెల్లించేందుకు వీలుగా ఆస్తిపన్ను సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిష్కరించేందుకు నేటి నుంచి బల్దియాలోని అన్ని సర్కిళ్లలో అధికారులు ‘ప్రాపర్టీ పరిష్కారం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నాం ఒంటి గంట వరకు నిర్వహించే ఈ పరిష్కారం కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొని, దరఖాస్తుదారుడి సమస్యను పరిష్కరించి, వారు వెంటనే పన్ను చెల్లించేలా కృషి చేయాలని కమిషనర్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బకాయిదారులు కూడా తాము చెల్లిస్తున్న ఆస్తిపన్నుకు సంబంధించి ఏమైనా సమస్యలున్నా, సందేహాలున్నా, వాటిని వెంటనే పరిష్కరించుకునేందుకు ఈ ప్రాపర్టీ పరిష్కారం కార్యక్రమాలకు హాజరుకావాలని సూచించారు. 24వ తేదీ ఆదివారంతో పాటు వచ్చే నెల 3, 17,24,31వ తేదీ వరకు ఈ కార్యక్రమాలను నిర్వసించనున్నట్లు తెలిపారు. ప్రతి సర్కిల్ ఆఫీసులో మూడు కౌంటర్లను ఏర్పాటు చేసి ఆస్తిపన్నుకు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇందులో రీవిజన్ పిటిషన్లు, అసెస్‌మెంట్ చేయని ఆస్తులను వెంటనే అసెస్‌మెంట్ చేసి, ఆస్తిపన్ను చెల్లింపు పరిధిలోకి తీసుకువచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలని కమిషనర్ అధికారులకు సూచించారు. ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నా, రూ. వంద కోట్లకు మించి అదనంగా పన్ను వసూలు కాలేదు. ఇప్పటి వరకు సిటీ కోర్టులో86 కేసులు, హైకోర్టుల్లో 74 వరకున్న కేసుల్లో ఎన్ని కేసులు పరిష్కారమవుతాయో? ఎంత వరకు అస్తిపన్ను కలెక్షన్ పెరుగుతుందో వేచి చూడాలి!
ప్రతి సంవత్సరం మార్చి నెలాఖరు కల్లా అధికారులకిచ్చిన ఆస్తిపన్ను కలెక్షన్ టార్గెట్లు చేరుకోవల్సి ఉండగా, ఈ సారి మారిచ 15లోపే అధికారులు తమకిచ్చిన లక్ష్యానికి తగిన విధంగా పన్ను వసూలు చేసేందుకు కృషి చేయాలని కమిషనర్ దాన కిషోర్ సూచించారు. ఈ నెలాఖరులో గానీ, వచ్చే నెల మొదటి వారంలో గానీ లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశమున్నందున, కలెక్షన్‌ను కాస్త ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించారు.

25, 26న మాతా అమృతానందమయి పర్యటన
ఖైరతాబాద్, : ప్రపంచవ్యాప్తంగా ఆధ్మాత్మిక బోధనలు ప్రబోధిస్తున్న మాతా అమృతానందమయి 25, 26 తేదీల్లో నగరంలో పర్యటిస్తున్నట్టు మఠం కో-ఆర్డినేటర్ రఘునాథ్ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. క్షణం తీరికలేకుండా గడుపుతున్న నగరవాసులకు ఆధ్మాతిక చింతనను బోధించేందుకు రెండు రోజుల పాటు అమ్మ నగరానికి వస్తున్నట్టు చెప్పారు. అమ్మ రాక సందర్భంగా మహేంద్ర హిల్స్‌లోని మఠంలో సత్సంగ్, భజనలు, మెడిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థులకు ఉపకార వేతనాలు, వితంతువులకు పెన్షన్లను అందజేస్తామని తెలిపారు.