హైదరాబాద్

సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, డిసెంబర్ 14: ప్రజాసమస్యలను పరిష్కరించడంలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందని తెలుగుయువత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు తూళ్ల వీరేందర్‌గౌడ్ విమర్శించారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ జిహెచ్‌ఎంసి ఉప్పల్ సర్కిల్‌లో సోమవారం నిర్వహించిన పాదయాత్రలో పాల్గొని పలు ప్రాంతాలలో స్థానిక నేతలతో కలిసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు. తొలుత చిల్కానగర్ చౌరస్తాలో స్థానిక స్వామి వివేకానందస్వామి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఇక్కడి నుండి న్యూరాంనగర్, ఆదర్శనగర్, స్వరూప్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, కళ్యాణపురి, ప్రశాంతినగర్, బీరప్పగడ్డ, శాంతినగర్, విజయపురికాలనీ, లక్ష్మారెడ్డికాలనీ, హబ్సిగూడ, రామంతాపూర్ రాంరెడ్డినగర్, వెంకట్‌రెడ్డినగర్, పాత రామంతాపూర్, రాజేందర్‌నగర్, గాంధీనగర్, నెహ్రూనగర్ తదితర ప్రాంతాలలో పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ టిడిపి హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్నారు. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యలను పట్టించుకోని అధికార టిఆర్‌ఎస్ పార్టీకి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తగు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో చేపట్టిన పాదయాత్రలో ప్రజల నుండి వచ్చే స్పందన చూస్తుంటే భారీ మెజార్టీతో ఘన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతకు ముందు టిడిపి సర్కిల్‌లో కార్పొరేటర్ టిక్కెట్‌కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆశావహులు వందలాది మంది తమ అనుచరులతో పాదయాత్రకు తరలించి బలాబలాలను చూపించుకోవడానికి పోటీపడ్డారు. చిల్కానగర్‌లో జల్లి మోహన్, బొమ్మగోని చైతన్యగౌడ్ యువసేన కార్యకర్తలు తరలి రావడంతో ఎన్నికల సందడి కన్పించింది.
ఈ కార్యక్రమంలో టిడిపి ఇంచార్జీలు కందికంటి అశోక్‌కుమార్‌గౌడ్, అరటికాయల భాస్కర్, బొబ్బల రమణారెడ్డి, సీనియర్ నాయకులు బొమ్మగోని దాసుగౌడ్, కోల రవికుమార్‌గౌడ్, కొట్టాల బాల్‌రాజ్, రాగి వెంకట్‌రెడ్డి, రఘుపతిగౌడ్‌పాల్గొన్నారు.