హైదరాబాద్

ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి: లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతవరణంలో జరిగే విధంగా అధికారులు సిబ్బంది కృషి చేయాలని అధికారులకు సైబరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ సూచించారు. కమిషనరేట్‌లో డీసీపీలు, ఏసీపీలు, సీఐలతో కలసి ఎన్నికల నిర్వహణ భద్రాత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీపీ మాట్లాడుతూ ఎన్నికలలో సమస్యత్మాక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఎన్నికలలో ఎలాంటి అవాంఛానీయ సంఘటనలు లేకుండా ఇన్సిడెంట్ ఫ్రీ ఎలెక్షన్స్ కావాలని కోరారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినందున ఉల్లంఘనలపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని అన్నారు. రాజకీయ నాయకులు హోర్డింగులు, ఫెక్సీలను ఏర్పాటు చేసుకునే వారు ఎన్నికల అధికారి నుంచి అనుమతి తీసుకుకోవాలని చెప్పారు. చె క్‌పోస్టులను ఏ ర్పాటు చేసి మద్యం, నగదు తరలించకుండా చూడాలని అధికారులకు సూచించారు. పోలింగ్ స్టేషన్ల లోకేషన్, రూట్ బందోబస్తు నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్లలోపు పార్టీ కార్యలయాలు ఉండరాదని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించే వాహనాలకు ఆర్‌వో అనుమతి తీసుకోవాలని తెలిపారు. బె ల్ట్ షాపులను మూ సివేయాలని, పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీరు, కుర్చీల వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఎస్‌హెచ్‌ఓలకు సూచించారు. మహిళలు, దివ్వాలాంగలు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని నాలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడ వద్దన్నారు. రౌడీ షీటర్లు ఎన్నికల నిర్వహణకు ఆటంకం కలిగించే అసాంఘిక శక్తులపై నిఘా ఉంచాలని అన్నారు. నాన్ బెయిలబుల్‌ను త్వరితగతిన పరిష్కరించాలని ఏసీపీలు, డీసీపీలు సరిహద్దు పోలీస్ స్టేషన్‌తోను రెవెన్యూ అధికారులతో సమన్వయంతో కలసి పని చేయాలని వివరించారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌తో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాదాపూర్ డీసీసీ వెంకటేశ్వర రావు, శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి, బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి, షీటీమ్ డీసీపీ అనసూయ, ఏసీపీ ఎస్బీ గౌస్ మొహియుద్దీన్, సీఏఆర్ హెడ్ క్వార్టర్స్ ఏడీసీపీ మాణిక్ రాజ్ పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీసు కమిషనర్‌గా భాధ్యలు స్వీకరించి ఏడాది పూర్తి చేసకున్నందుకు సీపీ సజ్జనార్‌కు పోలీసు అధికారులు కేట్ చేసి అభినందనలు తెలిపారు.