హైదరాబాద్

ఎన్నికల విధుల్లో 24వేల మంది సిబ్బంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు జిల్లా ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవైపు ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు ఓటర్లకు అవగాహన చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తూనే, మరోవైపు ఎన్నికల సిబ్బందికి తగిన శిక్షణను కూడా ఇస్తున్నారు. ఎన్నికల విధుల నిర్వహణ కోసం 24వేల మంది సిబ్బందిని నియమించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ వెల్లడించారు. ఇరవై శాతం అంటే 4800 మంది ఎన్నికల సిబ్బందిని రిజర్వులో సిద్దంగా ఉంచనున్నట్లు, నియామక ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే విక్టరీ ప్లే గ్రౌండ్స్‌లో తొలి దశ ఈవీఎంల తనిఖీలు పూర్తయ్యాయని, అభ్యర్థులు ఖరారైన తర్వాత మలి దశ తనిఖీలు చేపట్టనున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 6483 బ్యాలెట్ యూనిట్లు, 4802 కంట్రోల్ యూనిట్లు, మరో 5141 వీవీ ప్యాట్‌ల తనిఖీ ప్రక్రియను పూర్తి చేసినట్లు తెలిపారు. త్వరలోనే వీటిని అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారీగా కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కేవలం శిక్షణకు మరో వంద ఈవీఎంలను కేటాయించినట్లు వెల్లడించారు. నగరంలోని మొత్తం నాలుగు వేల పోలింగ్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఆదివారం నుంచి రెండురోజలు శిక్షణను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో 56 మందికి ఒక శిక్షణ తరగతిని నిర్వహించినట్లు, ఇపుడు 25 మందితో ఒక క్లాసును నిర్వహిస్తూ మొత్తం 425 శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు హైదరాబాద్, సికిందరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు డిప్యూటీ కమిషనర్, జోనల్ కమిషనర్, అదనపు కమిషనర్ స్థాయి 19 మంది అధికారులను ఇఆర్‌ఓలను నియమించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సెంటర్లనే లోక్‌సభ ఎన్నికలకు వినియోగించనున్నట్లు తెలిపారు.
‘పోస్టల్ బ్యాలెట్’కు ప్రత్యేకాధికారి నియామకం
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి నియామక పత్రంతో పాటే వారి పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తును కూడా అందజేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి దాన కిషోర్ తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వ్యవహారాలను ప్రత్యేకంగా పర్యవేక్షించేందుకు అదనపు కమిషనర్ జయరాజ్ కెనడీని చీఫ్ నోడల్ ఆఫీసర్‌గా నియమించినట్లు కమిషనర్ తెలిపారు.