హైదరాబాద్

ఆర్యవైశ్యులు సంఘటితంగా ముందుకు సాగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్: ఆర్యవైశ్యులు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సంఘటితంగా ముందుకు సాగాలని తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య పేర్కొన్నారు. ఆదివారం సోమాజిగూడ కత్రియా హోటల్‌లో ఇంటర్నేషనల్ వైశ్ ఫెడరేషన్ వ్యవస్థాపకులు రామ్‌దాస్ అగర్వాల్ జయంతి సందర్భంగా ‘వైశ్ ఎక్తా దివాస్’ వేడుకలను నిర్వహించారు. వైశ్య ఫెడరేషన్ ఉప్పల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రోశయ్య, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొల్లెటి దామోదర్ హాజరై మాట్లాడారు. వ్యాపారాలు నిర్వహించుకుంటూ వ్యక్తిగత, సామాజిక అభివృద్ధికి దోహదపడుతున్న ఆర్యవైశ్యులు సేవ కార్యక్రమాల్లోను ముందు వరుసలో ఉంటున్నారని అన్నారు. రాజకీయంగా మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలను దక్కించుకోలేక పోతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో అంతా సమష్టిగా ఉంటూ రాజకీయాల్లో సైతం రాణించాలని సూచించారు. ఆర్యవైశ్యుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, ఉప్పల్ వద్ద ఐదు ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు, రాజకీయంగా అవకాశాలను సైతం కల్పిస్తున్నారని కొల్లెటి దామోదర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా, హస్తకళా అభివృద్ధి సంస్థ బొల్లం సంపత్ కుమార్, భరత్ కుమార్, మమత, నాగరాజు పాల్గొన్నారు.