హైదరాబాద్

మహిళల రక్షణ, భద్రతే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జంట నగరాల్లో మహిళలకు రక్షణ, భద్రత అంశాలపై నగరవాసులను చైతన్యపరచడానికి ఇటు గవర్నర్ అటు పోలీసులు ఆదివారం నెక్లెస్ రోడ్డులో సందడి చేశారు. ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో షీ టీం రన్ ఆధ్వర్యంలో వేలాది మంది ఔత్సాహికులు పరుగులు తీశారు. రన్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో పాటు ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ శైలేందర్ కుమార్ జోషి, రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, క్రీడల సెలబ్రిటీస్ పాల్గొన్నారు. 10కే రన్‌ని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ప్రారంభించారు. ప్రస్తుతం మహిళలు ధైర్యంగా ముందుకు వస్తున్నారంటే జంటనగరాల్లో షీ టీం చేపడుతున్న వివిధ రకాల భద్రతా చర్యలతో పాటు రక్షణకు సంబంధించిన అంశాలు సత్పలితాలు ఇవ్వడం సంతోషకరమని అన్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ 10రన్‌కేకు ఇంత భారీ స్పందన వస్తుందని అనుకోలేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మహిళల కోసం షీ టీం సిబ్బంది చేస్తున్న భద్రత, రక్షణ చర్యలతో మంచి ఫలితాలు వస్తున్నాయనిని ఆశాభావం వ్యక్తం చేశారు. 10 రన్‌కే వచ్చిన ఆహుతులకు సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ గ్రీటింగ్ చెప్పారు. షీ టీం పర్యవేక్షిస్తున్న క్రైమ్ ప్రధాన అధికారిని శిఖా గోయల్‌ను గవర్నర్ నరసింహన్ అభినందించారు.
‘వీఆర్-1’ రన్ విజయవంతం
హైదరాబాద్ సిటీ పోలీసు, షీ టీమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘వీఆర్-1’ రన్ విజయవంతంమైంది. ‘మహిళల భద్రత మన అందరి బాధ్యత’ అనే నినాదంతో హైదరాబాద్ షీ టీమ్స్ రన్‌ను పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్డులో ఆదివారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభించారు. మహిళల భద్రతలో సిటీ పోలీసులు షీటీమ్స్ తీసుకుంటున్న చర్యలతోదేశంలోనే హైదరాబాద్ మహిళలకు రక్షణలో సురక్షితమైన నగరంగా గుర్తింపు పొందిందని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. వీఆర్-1 రన్‌లో భాగంగా 10కె, 5కే, 2కే రన్ నిర్వహించారు. హైదరాబాద్ చెందిన దాదాపు పదివేల మంది బాలబాలికలు, యువతి, యువకులతో పాటు మహిళలు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. రన్‌లో యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో నెక్లెస్ రోడ్డు, పీపూల్స్ ప్లాజా క్రీడా స్పూర్తిని చాటి మహిళలకు అండంగా ఉంటామంటూ భరోసా కల్పించారు.