హైదరాబాద్

మధ్యాహ్న భోజన సిబ్బంది ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఐటీయు ఆరోపించింది. ఎప్పటి నుంచో మధ్యాహ్న భోజన పథకంలో పని చేస్తున్న కార్మికులకు పని భద్రత కల్పించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాప్యం చేస్తున్నాయని సీఐటీయు నేతలు మండిపడ్డారు. భోజన పథకం ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు తక్షణ విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా ఫార్క్ వద్ద సీఐటీయూ ధర్నా చేసింది. సీఐటీయూ అధ్యక్ష, కార్యదర్శులు వరలక్ష్మి, రమ నిరసనకారులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోవు రోజుల్లో స్వచ్ఛంద సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పజెప్పడానికి ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు. తెలంగాణలో ఇప్పటికే కొన్ని మండలాల్లో స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పిన విషయాలను వారు గుర్తు చేశారు. ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు పని చేస్తున్నాయని, వారి పొట్టకొట్టవద్దన్నారు. తమిళనాడులో మధ్యాహ్న పథకం మెరుగ్గా పనిచేస్తోందని, అదే తెలంగాణలో కుంటుబడుతోందని వారన్నారు. ఆంధ్ర, తమిళనాడు ఇచ్చేనట్లే తెలంగాణలో వేతనాలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలను 18వేలకు పెంచాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెనూ చార్జీలను సైతం పెంచాలన్నారు. కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, అవసరమైన గ్యాస్‌తో పాటు గుడ్లు సరఫరా చేయాలన్నారు. గత 17 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.