హైదరాబాద్

కలెక్షన్ చేయకుంటే ఇంక్రిమెంట్ కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మహానగర పాలక సంస్థకు ప్రధానమైన, అతి ముఖ్యమైన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లపై బల్దియా బాసు దృష్టి సారించారు. ఇప్పటికే ఒకవైపు ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్న సిబ్బందికి ఇదివరకే ఇచ్చిన కలెక్షన్ టార్గెట్లకు సంబంధించి ఈ నెల 15వ తేదీ వరకు కమిషనర్ దాన కిషోర్ డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే! గత ఆర్థిక సంవత్సరం రూ.1326 కోట్ల మేరకు ఆస్తిపన్నును వసూలు చేసుకున్న అధికారులు వర్తమాన సంవత్సరం రూ.1500 కోట్ల కలెక్షన్‌ను టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం రూ. 1100 కోట్ల వరకు మాత్రమే పన్ను వసూలైంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న విషయాన్ని ముందుగానే పసిగట్టిన బల్దియా అధికారులు ఈసారి కాస్త ముందుగానే అధికారులకు కలెక్షన్ టార్గెట్లను విధించి, లక్ష్యాన్ని చేరుకునేందుకు ఈనెల 15వ తేదీ వరకు గడువు విధించారు. అయినా ఆశించిన స్థాయిలో కలెక్షన్ కాకపోవటంతో కమిషనర్ దాన కిషోర్ ప్రతిరోజు జోనల్ స్థాయిల్లో టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే మంగళవారం ఉదయం కూడా టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన కమిషనర్ కలెక్షన్‌ను బట్టి నగరంలోని ఆరు జోన్లకు చెందిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇచ్చిన టార్గెట్‌లో కనీసం 90 శాతం మేరకైనా కలెక్షన్ చేయాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరిస్తూ, కలెక్షన్‌లో విఫలమైనట్టు చార్జెస్ ఫ్రేమ్ చేస్తామని, ఇంక్రిమెంట్‌ను కట్ చేస్తామని, అవసరమైతే సర్వీసు రికార్డుల్లో కూడా రాస్తామని కమిషనర్ హెచ్చరించినట్లు సమాచారం. ఉదయం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో తమను ఇప్పటికే ఎన్నికల విధుల్లో నియమించినందుకు తాము చాలా బిజీగా ఉన్నామని, ఎలక్షన్ విధులతో పాటు కలెక్షన్ విధులు కూడా నిర్వహిస్తున్నామని కొందరు అధికారులు సమాధానం చెప్పుకోగా, రెండు విధులను సమానంగా నిర్వహించాలని, ఇచ్చిన టార్గెట్ ప్రకారం కలెక్షన్ చేయాల్సిందేనని అధికారులకు కమిషనర్ తేల్చి చెప్పారు. అయితే ఎన్నికల విధుల్లో కీలకమైన విధులు నిర్వర్తించే రిటర్నింగ్ అధికారుల్లో ఎక్కువ మంది ప్రతిరోజు సుమారు 12 నుంచి 14 గంటల పాటు ఎన్నికల విధుల్లో గడుపుతూనే, ఆస్తిపన్ను కలెక్షన్‌ను ఎప్పటికపుడు ఫోన్లలో పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదులను సక్రమంగా పరిష్కరించకపోవటంతో పన్ను చెల్లించేందుకు బకాయిదారులు ముందుకు రావటం లేదని అధికారులు వాపోతున్నారు.