హైదరాబాద్

కాంగ్రెస్ విజయం ఖాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేపీహెచ్‌బీకాలనీ: సీఎం కేసీఆర్ ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం కూకట్‌పల్లిలోని తూము పద్మారావు గార్డెన్‌లో నిర్వహించిన మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని కూకట్‌పల్లి నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కూన శ్రీశైలంగౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారి ఇబ్బందులు తోలగిపొవాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఈకార్యక్రమంలో కూన శ్రీశైలంగౌడ్ ,శివకుమార్, మాజీ ఎమ్మెల్యే సీతక్క, వెంగళ్ రావు, రవికుమార్ , నాగిరెడ్డి, బాలాజీ, యాదగిరి, ఎడ్ల ప్రభాకర్, కృష్ణ, రమేష్ బాబు, రమేష్, రాజు ముదిరాజ్, మోయిజ్, గోపాల్‌రెడ్డి, పార్వతిదేవి, దుర్గారాణి, ప్రభావతి పాల్గొన్నారు.