హైదరాబాద్

జాతీయ త్రోబాల్‌కు ‘తెలంగాణ’ జట్ల ప్రకటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: హర్యానాలో 29వ జూనియర్ జాతీయ త్రోబాల్ చాంపియన్‌షిప్ ఈనెల 23 నుంచి 25 వరకు జరుగుతాయి. చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బాలబాలికల జట్ల వివరాలను తెలంగాణ త్రోబాల్ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్.సోమేశ్వర్ రావు తెలిపారు. జట్టుకు ఎంపికైన బాలబాలికలకు కిట్స్‌ను సోమేశ్వర్ రావు అందజేశారు. బాలుర జట్టుకు కోచ్‌గా అరుణ్ కుమార్, మేనేజర్‌గా అశ్విన్ కుమార్, బాలికల జట్టుకు కోచ్‌గా అవినాశ్, మేనేజర్‌గా అరుణ కుమారి ఎంపికయ్యారు.
* బాలికల జట్టు వివరాలు: ప్రాచి దేశ్‌పాండే, సైనాదయ్ కుమార్, రుక్మిణీ కుమారి, మహీన్, అమృత, యశస్వీ, మిరిల్లె, ప్రియాంక, శ్రీహా రెడ్డి, శ్రావంతి, శాలిని, స్వేచ్చ సోనాల్, హారిక, హిమాణి ఉన్నారు.
* బాలుర జట్టు వివరాలు: రాజరాం, శ్రీనివాస్, బాలాజి, స్వామి, రాజు, అక్షిత్, నితిన్, కుల్‌దీప్, రునిత్ రెడ్డి, మారు, మణికాంత్, సందేశ్, గణేశ్, సిద్ధానర్థ్ రెడ్డి, భగవంత్ రావు.
అసోసియేషన్ ఫర్ ఆక్యూపేషనల్ హెల్త్‌కు అధ్యక్షుడిగా భక్తియార్ చౌదరి
హైదరాబాద్, మార్చి 21: నగరానికి చెందిన ప్రముఖ క్రీడా వైద్యుడు, అక్యూపేషనల్ హెల్త్ స్పెషలిస్ట్ ప్రొపెసర్ మేజర్ డాక్టర్ ఎస్.భక్తియార్ చౌదరి అసోసియేషన్ ఫర్ ఆక్యుపేషనల్ హెల్త్ తెలంగాణ నూతన కార్యవర్గం అధ్యక్షునిగా ఎంపికయ్యారు. నగరంలో జరిగిన అసోసియేషన్ వార్షిక కార్యవర్గ సభ్యుల సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ పదవితో పరిశ్రమల్లోని కార్మికులతో వృత్తిపరమైన ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు తన సహకారం అందించనున్నారు. నగరానికి చెందిన భక్తియార్ చౌదరి ప్రముఖ క్రీడా వైద్యుడే కాకుండా సైనికుడిగా, మీడియా బోధకుడిగా పనిచేశారు. అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్‌గా సీజీహెచ్‌ఎస్ రిటైర్డ్ అధికారి డాక్టర్ పీ.విశే్వశ్వ రావు, డాక్టర్ నంద కిషోర్, ప్రధాన కార్యదర్శిగా ఎన్‌ఎఫ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్.సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శిగా అమర రాజు బ్యాటరీస్‌లో సీనియర్ ఆక్యుపేషనల్ హెల్త్ ఫిజిషియన్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్.చంద్రబాబు , కోశాధికారిగా ఎన్‌ఎఫ్‌సీలో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఉమా గిరీష ఎంపికైంది.